రోడ్డు ప్రమాదంలో చింతలఠాన గ్రామానికి చెందిన వ్యక్తి మృతి
బోయినిపల్లి,మే 25 (నిజం న్యూస్)
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి పెట్రోల్ పంప్ వద్ద హన్మకొండకు చెందిన ప్రైవేటుబస్సు హనుమాన్ స్వాములతో వేములవాడ మీదుగా కొండగట్టు వెళ్తుండగా వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో చింతల్ ఠాణాకు చెందిన బడుగు గణేష్ (28) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినారు. మృతుడు ఓల్డ్ చింతన నుండి పొత్తూరు వెళ్తున్నాడు.మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కొరకు పంపించడం జరిగింది. ప్రైవేట్ బస్సులో హనుమాన్ భక్తులు దాదాపుగా 50 మంది ఉన్నారు. మృతుడికి భార్య,ఇద్దరు కుమారులు.