పేద వైశ్యునికి సీఎం సహాయనిది నుండి ఎల్ ఓ సి అందజేత

టూరిజం శాఖ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్, ఉప్పల శ్రీనివాస్ గుప్త .

హైదరాబాద్ మే 24 నిజం న్యూస్

హైదరాబాద్ లోని చింగిచెర్ల కు చెందిన కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారి బి. రామకృష్ణ కూతురు సహస్ర కు గత10 సంవత్సరాల నుండి కీళ్ళ నొప్పులు మరియు పెరుగుదల, జీర్ణ వ్యాధితో బాధపడుతునందుకు ఆరోగ్య ఖర్చులకు ప్రతి నెల 20 వేల రూపాయలు అవుతున్న వేళా ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి ద్వారా అక్షరాల 2 లక్షల రూపాయలను *_రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త_ ఎల్ ఓసి ఇప్పించడం జరిగింది.

అలాగే వీరి కుమారునికి జార్ఖండ్ లో సైనిక్ స్కూల్ తిలైయా లో చదువుతున్న ఉన్నత చదువుల నిమిత్తం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరుపున గతంలో 40 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా 10 వేల రూపాయలను చెక్కు రూపంలో ఇవ్వడం జరిగింది.

గత 10 సంవత్సరాల నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నా కూతురుకి ఆరోగ్య ఖర్చులకు ఎల్ ఓ సి ద్వారా ఇప్పించిన _ఉప్పల శ్రీనివాస్ గుప్త_ ప్రత్యేక అభినందనాలు, ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల కష్టాలు ఎరిగి, సహాయ సహకారాలు అందించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు ఆర్య వైశ్యులు, కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు…