శిథిలావస్థలో వి.యం.బంజర్ బస్టాండ్

పెనుబల్లి మే 23 (నిజం న్యూస్):

పెనుబల్లి మండలం వి.యం.బంజర గ్రామంలో వంగా.సుబ్బయ్య,వంగా.సీతారామయ్య,వంగా.రామయ్య, వంగా.చెన్న రాయుడు బస్టాండ్ నిర్మించడానికి కోట్లు విలువైన రెండు యకరల భూమినీ జలగం.వెంగళరావు హయాం లో గ్రామ అభివృద్ధి కై 1977 వ సంవత్సరం లో నిర్మించడం జరిగినది.నేడు ఈ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకొని తీవ్ర దుర్గంధం విరజల్లుతు కనీస అవసరాలు లేక దీన స్థితికి చేరుకుంది.జాతీయ రహదారిలో నాలుగు రోడ్ల కూడలి అయినటువంటి ఈ బస్టాండ్ నందు మండలంలోని ప్రజలు విజయవాడ,ఖమ్మం,భద్రాచలం,రాజమండ్రి,హైదరాబాద్, కాకినాడ,కొత్తగూడెం, పాల్వంచ,అశ్వరావుపేట, మణుగూరు పలు ప్రాంతాలు పోవాలన్న ఈ బస్టాండ్ ప్రధాన కూడలి.అలాగె మండలం లో వున్న పరిసరప్రాంత విద్యార్థులు చదువు కొరకు బస్ లో ప్రయాణించడానికి ప్రధానమైనది ఈ బస్టాండ్.అలాగె రోజుకు కొని వందల బస్సులు వేల ప్రయాణికులు ప్రయాణించే ఈ బస్టాండ్ లో బస్సుల కోసం వేచి చూడటానికి సరైన కుర్చీలు లేక పక్కనే టాయిలెట్స్ ఉండడం వలన ఆ దుర్వాసనతో ప్రయాణికులు అక్కడ వేచి ఉండలేకపోతున్నారు.అలాగే ఆ వాసన భరించలేక టాయిలెట్స్ వాడలేక బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం వల్ల దుర్గంధం విరజల్లి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉందని అలాగె సరైన డ్రైనేజ్ లేకపోవడం వలన నీరు నిలవడం వల్లన స్వైరవిహారం చేయడానికి పందులకి,దోమలకీ స్థావరంగా మారడం తో స్థానిక ప్రజలు,ప్రయాణికులు అనారోగ్యాలకు గురై అసుపత్రి పాలు అవుతున్నారు.అలాగె బస్టాండ్ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా వుంటు అసాంఘిక కార్యకాపాలకు అడ్డాగా మారడం తో పాటు ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే గదులు పూర్తి స్థాయి లో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికైనా ఈ సమస్యపై ఆర్టీసీ అధికారులు గాని స్థానిక అధికారులు గాని స్పందించి శుభ్రత పరిశుభ్రత పాటించే విధంగా అన్ని సౌకర్యాలు కలిగే విధంగా బస్టాండ్ ను నిర్మించాలని ప్రయాణికులు ప్రజా ప్రతినిధులు కోరుచున్నారు.