Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కు మోక్షం ఎప్పుడో …..?

ఎల్ .బి .నగర్ ,మే 23(నిజం న్యూస్ ) :- తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన పథకాల్లో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం ఒకటి .కానీ ఆశించిన స్థాయి లో ఈ పథకం అమలు కావడం లేదనేది జగమెరిగిన సత్యం గా అనిపిస్తుంది .ఎదో ఒక సినిమాలో ఒక నటుడు కోడి ని వేలాడేసి కోడిని చూస్తూ చికెన్ తింటున్నట్టు గా భ్రమ పడతాడు ..అన్నం లో పచ్చడి తింటూ ..అలా ఉంది నేడు ప్రజల పరిస్థితి ..

ఎల్ .బి .నగర్ నియోజక వర్గం లోని తట్టి అన్నారం ,తట్టిగూడ ఏరియా ప్రజల పరిస్థితి .నిర్మాణాలు పూర్తి చేసుకుని నెలలు గడుస్తున్నా ఇంకా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కేటాయించట్లేదు .ఎన్నో నెలల నుండి ఆ ఇళ్లను ఉదయం ,సాయంత్రం చూస్తూ …తమ పనులకు వెల్తూ …ఇంకా ఎప్పుడు ఇస్తారో అని ఎదురు చూస్తూ ఆశగా వెళ్తున్నారు .తట్టి అన్నారం ,హత్తిగూడ (వీరన్న గుట్ట కాలనీ ప్రక్కన ),హయత్ నగర్ డిగ్రీ కాలేజీ సమీపం లో నిర్మాణాలు జరుగుతుండగా..తట్టి అన్నారామ్ ,హత్తిగూడ ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి అయ్యి ప్రారంభానికి సిద్ధం గా ఉన్నాయ్ .

Also read: బోనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ని యువత సద్వినియోగం చేసుకోవాలి

డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అప్పుడే పాతబడి కిటికీ రెక్కల అద్దాలు పగిలిపోతున్నాయి.ప్రస్తుతం పెరుగు తున్న ధరలకు పేదవాళ్ళ సంపాదన పేరుగక “దంచిన కాడికి బుక్కుడు” అన్న చందం గా ఉంది పేద వాళ్ళ పరిస్థితి .పనులు సరిగా దొరక్క పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక ,పరిస్థితి బాగాలేక ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఇక అంతే సంగతి .హైదరాబాద్ మహానగరం శరవేగం గా అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషపడాలో …తమ కు జీవిత భద్రత లేనందుకు బాధపడాలో పేదప్రజల కు అర్ధం కావడం లేదు .హైదరాబాద్ మహా నగరం లో పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలి పోతున్నది .కాబట్టి ప్రభుత్వం పాత పద్ధతులు అన్నింటికీ స్వస్తి పలికి డివిజన్ వారీగా ,కాలనీల వారీగా అసలు ఇల్లు లేకుండ జీవిస్తున్న వారిని గుర్తించి వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకుని వాళ్లకు కేటాయించాలని పలువురు కోరుతున్నారు .మన్సూరాబాద్ డివిజన్ లోని వీరన్న గుట్ట ,శివమ్ హిల్స్ ,శివగంగ కాలనీ ,ప్రియదర్శిని కాలనీ ,తట్టి అన్నారం ,కుంట్లూర్ ,పాత హయత్ నగర్ ,బంజారా కాలనీ ,
లాంటి తదితర ప్రాంతాల్లో ఉన్న వారికి కేటాయించాలని పలువురు కోరుతున్నారు . హైదరాబాద్ మహా నగరం అభివృద్ధి 60శాతం భవన నిర్మాణ రంగం పైనే ఆధారపడి ఉంది .కానీ ఆ రంగం లో పని చేస్తున్న వారికే ఇప్పటి వరకు సొంత ఇండ్లు లేక కిరాయి ఇండ్ల లో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ రంగం లో సుతారి పని ,వడ్రంగి పని ,సెంట్రింగ్ ,రాడ్ బెండింగ్ ,మట్టి పని ,ఎలక్ట్రీషియన్ టైల్స్ ,మార్బుల్స్ ,పెయింటింగ్ ,రైలింగ్ తదితర పనుల కోసం ఎన్నో ఏళ్ళ క్రితం వలస వచ్చి కిరాయి ఇళ్లలో ఉంటూ కాలం వెళ్ళ దీస్తున్నారు .వీరే కాక ..ఇంకా చిన్న ,చిన్న పనులు చేస్తూ బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు .ఖాళీ బాటిల్స్ శుభ్రం చేసి ప్యాక్ చేసే కంపెనీ ల లో ,ఇళ్లలో పని చేసే వారు ,స్వీట్ ,మిక్షర్ కంపెనీల లో పని చేసేవారు ,కిరాణం షాప్స్ లో ,సిమెంట్ షాప్స్ లో పని చేసేవారు ,హోటల్స్ లో పని చేసే వారు ,ట్రాలీ ఆటో లు నడిపే వారు ,ప్రైవేట్ టీచర్స్ ,ఫుట్ పాత్ లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రతికే వాళ్లకు ఎవరికీ సొంత ఇల్లు లు ఉండవు . కాబట్టి స్థానిక ఎం ఎల్ ఏ మరియు కార్పొరేటర్లు స్పందించి అసలు ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి వాళ్ళ కె ఇండ్లు కేటాయించి ఆదుకోవాలని పలువురు కార్మికులు కోరుతున్నారు .