బోనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ని యువత సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.
సూర్యాపేట మే 23 నిజం న్యూస్
సూర్యాపేట పట్టణంలో ని 13 వ వార్డు గాంధీనగర్ లోని భాషానాయక్ తండాలో బోనమ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ని సోమవారం రోజున ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఫ్యాషన్ టెక్నాలజీ లో మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఈ అవకాశాన్ని ప్రతి యువత సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసి యమ్ యస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పాల్గొన్నారు.
సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు మహ్మద్ చాంద్ పాషా, అప్పం శ్రీనివాసరావు చేనేత సంఘం అధ్యక్షుడు, 13 వ వార్డు అధ్యక్షులు షేక్ రఫీ, ఇన్స్టిట్యూట్ యజమాని గుంటి నగేష్, వట్టే గంగరాజు. గుంటూరు విజయ్. సుమన్ చల్ల, వెంకన్న.మహిళలు యువకులు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.