సత్తుపల్లి నుండి దేశరాజధానికి ఎగుమతి
-మామిడి ఒరుగుల తయారీ,ఎగుమతి
-రైతులకు ఆదాయం,మహిళలకు ఉపాధి
-వేసవిలో మూడు నెలల పాటు భరోసా
సత్తుపల్లి మే 17 (నిజం న్యూస్)
నియోజకవర్గంలో మామిడి ఒరుగులు తయారీ తో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో వీటితో చేసే మంచి డిమాండ్ ఉండటంతో ఇక్కడ తయారు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వేసవిలో మూడు నెలలు ఈ పని ద్వారా రైతులకు ఆదాయ లభించడమే కాక మహిళల ఉపాధికి డొక లేకుండాపోయింది.
ఏమిటి ఒరుగులు
పులుపు గా ఉండే వంటలను చేసేందుకు మామిడి గుజ్జును ఎక్కువమంది వినియోగిస్తారు అయితే దొరకనప్పుడు ఎక్కువమంది ఓరుగుల పై ఆధార పడతారు.కాపు వచ్చినప్పుడు మామిడికాయ పై తొక్క తీసి కండ పట్టిన ముక్కలను మాత్రమే ఎండబెట్టి ఓరుగులు చేస్తారు. ఈ మేరకు విదేశాలకు వెళ్తున్న వారు, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వీటిని ఎక్కువగా వినియోగిస్తుండగా డిమాండ్ ఉండడంతో స్థానిక రైతులు తయారీలో నిమగ్నమయ్యారు మార్కెట్లో కొనుగోలు చేయని కాయలు, గాలి దుమారానికి రాలి పడిన కాయలు,తోటల్లో సైజు లేని దెబ్బతిన్న కాయలతో కూడా ఓరుగులు తయారు చేస్తారు. తొలుత కాయల చెక్కుతీసి టెంక రాకుండా మెత్తటి కండను మాత్రమే ముక్కలుగా కోస్తారు ముక్కలను మూడు నాలుగు రోజులపాటు ఆరబెట్టడం తో పురుగులు సిద్ధమయ్యాక ఢిల్లీ మార్కెట్ కి తరలించి క్వింటాలు చొప్పున విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు.
aslo read: తప్పుడు పద్ధతుల్లో పొందిన పట్టా భూముల వ్యవహారంలో కీలక మలుపు
ధర పెరిగింది
ప్రస్తుతం మామిడి ధర విపరీతంగా పెరిగింది గత ఏడాది టన్ను రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఉండగా ఈసారి పోత లేకపోవడంతో రూ.12 వేలు నుంచి రూ.15 వేలు వరకు చేరింది దీంతో గత ఏడాది రూ.15 వేలు గా ఉన్న ఒరుగులు ఇప్పుడు రూ.20 వేలు పలుకుతుంది కాగా ఓరుగుల తయారీతో మూడు నెలలపాటు స్థానికంగా మహిళలకు ఉపాధి లభిస్తోంది. 40 కేజీల మేరకు ముక్కలు కొస్తే 60 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారని ఒక్కొక్కరు 6 నుంచి 12 నెలలకు సరిపడా రోజుకు రూ 320 నుంచి రూ.720 వరకు సంపాధిస్తున్నట్లు మహిళలు తెలిపారు