తేనెటీగల దాడిలో పలువురికి గాయాలు

తేనెటీగల దాడిలో పలువురికి గాయాలు

పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి నరసయ్య, బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్.

తుంగతుర్తి ఏప్రిల్ 20 నిజం న్యూస్

మండల పరిధిలోని వెలుగు పల్లి గ్రామంలో గురువారం రోజున ఉపాధి హామీ పనులకు వెళ్లిన గుడిపాటి ఎల్లమ్మ, పాలడుగు పిచ్చమ్మ, సుశీల అందే నాగమ్మ ,తో పాటు పలువురికి తేనెటీగలు దాడి చేయడంతో భయబ్రాంతులకు లోనై, దవాఖానాల్లో చికిత్స పొందుతున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి నరసయ్య ప్రవేట్ దవాఖానాల్లో వారిని పరామర్శించి, మెరుగైన వైద్యం అందించుటకు అధికారులు కృషి చేయాలని కోరారు. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి ,పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేయాలన్నారు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుమల ప్రగడ కిషన్రావు, దొంగరి గోవర్ధన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.