మన పని మనం చేసుకోవడం లోనే అసలైన సంతృప్తి

మన పని మనం చేసుకోవడం లోనే అసలైన సంతృప్తి – అంటున్న లైన్ ఇన్స్పెక్టర్ వెంకట్
నిజం న్యూస్ ముదిగొండ మండలం మే 19:-
వచ్చేది వర్షాకాలం రోడ్ల వెంట అడ్డగోలుగా పెరిగిన చెట్ల కొమ్మలను కరెంట్ వైర్ల కింద పెరిగిన కొమ్మలను తానే స్వయంగా నరికేస్తూ ఔరా అనిపించుకుంటున్న లైన్ ఇన్స్పెక్టర్ దొడ్డ వెంకట్ …. నిజం న్యూస్ వివరణ కోరగా మన పని మనం చేసుకోవడం లోనే నిజమైన సంతృప్తి అంటున్న లైన్ ఇన్స్పెక్టర్
పై స్థాయి లో ఉండి కూడా ఇలాంటి పనులను కూడా తానే స్వయంగా చేయడం తో ఇలాంటి లైన్ ఇన్స్పెక్టర్ మాకు రావడం హర్షించదగ్గ విషయం అంటున్న గ్రామ ప్రజలు