మీటర్ ఫిట్ చేయలేదు బిల్లులు పేర వసూళ్లు??

లింగంపల్లి అవిలయ్య నుండి 1158 అక్రమంగా రూపాయలు వసూలు.

నెల ,నెల బిల్లు వసూలు చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని జిల్లా కరెంట్ అధికారులకు ప్రజాప్రతినిధులకు, వృద్ధ దంపతుల వేడుకోలు.

మద్దిరాల మే 19 నిజం న్యూస్

కుక్కడం గ్రామ పంచాయితీ మద్దిరాల మండలం. లింగంపల్లి అవిలయ్య కు మీటరు మంజూరు అయి, రెండు సంవత్సరాలు దాటిపోయినా, నేటి వరకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మీటర్ పెట్టక పోగా, సంబంధిత ప్రైవేటు వ్యక్తులు, ప్రతి నెల డబ్బులు వసూలు చేస్తున్న సంఘటన కుక్కడం గ్రామములో ఆలస్యంగా వెలుగు చూసింది..

 

విద్యుత్ డిపార్ట్మెంట్ వారు మీటరు పిట్ చేయలేదు.. ఈ యొక్క ఇంటిలో కేవలం వృద్ధ దంపతులు మాత్రమే జీవనం కొనసాగిస్తున్నారు. కనీసం విద్యుత్ అధికారులకు కనికరం లేకుండా, వేధిస్తూ బిల్లులు వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని , అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నామా అని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నపర్తి జ్ఞాన సుందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో, మీటర్ ఫిట్ చేయకపోగా, బిల్లులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

కాని ప్రతి నెల కరెంట్ బిల్లు అందాదగా వసూలు చేస్తున్నారు. విద్యుత్ డిపార్ట్మెంట్ వారు తేది 17మే నా అవిలయ్య కు రూ 1,158 బిల్లు వచ్చింది నీవు బిల్లు కట్టాలి లేదంటే పోలీసు వారు పట్టు కపోతారని చెప్పగానే, పాపం అప్పుచేసి మరల 600 రూపాయలు చెల్లించారు. భార్యా భర్త మాత్రమే ఉంటారు ఇంత బిల్లు రాదు.

ఇంత కాలం మీటరు పిట్ చేయకుండా ఉండడం నేరం. లైన్ మెన్ లేకపోవడం ప్రైవేటు వ్యక్తులు పనిచేయడం వారు ప్రజల వద్ద అక్రమంగా వసూల్ చేయడం జరుగుతుంది.

జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్, కరెంటు ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తక్షణమే వృద్ధ దంపతులకు మీటర్ ఏర్పాటుచేసి, అక్రమంగా వసూలు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, పేద వృద్ధ దంపతుల పక్షాన ఆయన కోరుతున్నారు.