ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ

తిరుమలగిరి (సాగర్) మే 18 (నిజం న్యూస్)
మనది భారతదేశం మనది ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించేది నల్లగొండ
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని,ప్రజాప్రతినిధులు, సర్పంచ్, యం.పి.టి.సి,మరియు ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ కొరకు సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి..
– – సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట.
– – జిల్లాలోని అన్ని గ్రామాలలో సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి
–ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానము.
నల్లగొండ జిల్లాలో అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, సర్పంచ్, ఎంపిటిసిలు మరియు ప్రజల భాగస్వామ్యంతో పోలీస్ శాఖ నేరాల నియంత్రణ కొరకు సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సిసి కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయని, వీటిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం ద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించడంలో సిసి కెమెరాలు కీలకంగా మారుతున్నాయని,అనేక కేసులును ఛేదించడంలో, దొంగతనాలు జరిగినప్పుడు సిసి కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినమని, ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని అప్పుడే గ్రామీణ ప్రాంతాలలో నేరాలను నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించేలా చేయడంలో సిసి కెమెరాలు ఉపయోగపడతాయని, అంతే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే సందర్భంలో చాలా కేసులలో గుద్ది పారిపోయే వాహనాలను గుర్తించే అవకాశం సైతం సిసి కెమెరాలతో కలుగుతుంది. నల్లగొండ జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను సహకరిస్తూ ప్రతి గ్రామంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు.