ఆలోచన పడేసిన మెసేజ్… తస్మాత్ జాగ్రత్త సుమ

సూర్యాపేట మే 18 నిజం న్యూస్
పెద్దపల్లి కి చెందిన ఓ యువకుడు తన బైక్ పై వినూత్న రీతిలో రాశాడు. ఈ బైక్ ను చూసిన ప్రతి ఒక్కరూ ఆలోచన పడ్డారు.. అసలు విషయం ఏమిటంటే, బైక్ పై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకుంటారు. ఈ యువకుడు తన బైక్ ప్లేట్ మీద 40_60 స్పీడ్ తో వెళితే వెళ్లి వస్తానని,80_100 పోతున్నానని,120_140 నన్ను మరిచిపో అని రాయించాడు. వాహనాలు నడిపే వారు ఏ విధమైన వేగంతో వెళితే ఏ విధంగా ఉంటుందనేది యువకుడు రాసి చూపించాడు.. దీనితో నెంబర్ ప్లేట్ చూసిన ప్రతి వ్యక్తి , ఖంగు తింటున్నారు ఇది పూర్తిగా వాట్సాప్ లో వైరల్ గా మారింది.. ఏది ఏమైనా యువకుని నూతన ఆలోచనకు, ప్రతి వాహనదారుడు హాట్సాఫ్ చెప్పవలసిందే సుమ…