అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్.
తుంగతుర్తి మే 18 నిజం న్యూస్
తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో తిరుమలగిరి మున్సిపాలిటీ నుండి వివిధ పార్టీలకు చెందిన పానుగంటి గణేష్, మంద నరేష్,పతేపురం నర్సింహ,కందుకూరి విష్ణు,చందు,నరేష్,పరశరాములు వారితో పాటు పలువరు నాయకులు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బుధవారం రోజున తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.
నూతనంగా TRS పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరుతూ, చిన్న కుటుంబాల ప్రతి ఒక్కరి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కళ్లెట్ల పల్లి శోభన్ బాబు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రఘునందన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రజిని, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కందుకూరు లక్ష్మయ్య, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.