జిల్లా ఉత్తమ వాసవియన్ గా వెంపటి శబరినాధ్

జిల్లా ఉత్తమ వాసవియన్ గా వెంపటి శబరినాధ్

టెక్నాలజీ ని వాడుకుంటూ వాసవి క్లబ్ లో సేవారంగం లో దూసుకెళుతున్న సాఫ్ట్ వేరు ఉద్యోగి.

ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తిరువిది వేణుగోపాల్ చేతుల మీదుగా వరంగల్ లో జరిగిన విజన్ అవార్డ్ లో ప్రదానం.

శుభాకాంక్షలు తెలిపిన పలువురు వాసవియన్స్.

సూర్యాపేట మే 17 నిజం న్యూస్

 

హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ కరోనా సమయంలో వాసవి క్లబ్ రిజియన్ సెక్రటరీగా వివిధ సేవలు అందించిన సూర్యపేట జిల్లా కేంద్రానికి చెందిన వెంపటి శబరినాధ్ కు వరంగల్ లోని వాసవి ఫంక్షన్ హాలో లో జరిగిన వాసవి విజన్ అవార్డ్ ఫంక్షన్ లో వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ ప్రెసిడెంట్ తిరువిది వేణుగోపాల్ చేతుల మీదుగా ఉమ్మడి జిల్లా ఉత్తమ ప్రధమ వాసవియన్ గా అవార్డ్ అందుకున్నారు

.

గతంలో కరోనా సమయంలో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 200 రోజుల శిక్షణ కార్యక్రమంలో టెక్నీకల్ చైర్ పర్సన్ గా వ్యవహరించారు.కరోనా సమయంలో ఆర్యవైశ్య చిరువ్యాపారుల సహాయం నిమిత్తం 50 వేల రూపాయలు విరాళాలు సేకరించి వి.సి.ఐ కు అందజేశారు.ఆహా ఏమి రుచి వంటల పోటీల చైర్మన్ గా వ్యవహరించడమే కాకుండా కరోనా నిర్మూలన కొరకు 4 సార్లు పలు దేవాలయాలకు పాద యాత్ర చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా లో ఏకైక వాసవియన్ గా గుర్తి0పు పొందారు.

వాసవి క్లబ్ డిస్టిక్ డైరెక్టరి రూపొందించి చైర్మన్ గాకూడా వ్యవహరించారు. వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ అంతర్జాతీయ మాజీ అధ్యక్షులు ఐత రాములు ,వాసవి క్లబ్ మాజీ గవర్నర్ రుద్రంగి రవి శశి ఆశీర్వాదంతో పలువురు సేవాకార్యక్రమాలు నిర్వహించి చేయూత మహా దాత అవార్డ్నుసైతంఅందుకోవడ0 తో పలువురు వాసవియన్స్ , వర్తక వాణిజ్య ఆర్య వైశ్యులు, శుభాకాంక్షలు తెలిపారు..