అనాధ పిల్లలకు అండగా హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో మే 17 (నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ రోడ్డు పక్కన దినసరి కూలీలు పనులు చేస్తున్న సమయంలో వరంగల్ నుండి హైదరాబాద్ కు వచ్చే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్షం వల్ల అక్కడే పని చేస్తున్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన ఊరెళ్ల శ్యాంసుందర్ లావణ్య దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది వీరు దినసరి కూలీలు వీరికి ఎటువంటి ఆధారం లేదు వీరికి ఇద్దరు ఇద్దరు పిల్లలు రితిక గణేష్ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల గురించి తెలిసిన వెంటనే హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్ (స్వచ్ఛంద సేవా సంస్థ) వారు మరియు కొంతమంది దాతల సహాయంతో ఆ పిల్లల సంరక్షణ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా 20వేల చెక్కును,నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హ్యాపీ లైఫ్స్ ఫౌండేషన్ సభ్యులు బండారి ప్రసాద్ ముదిరాజ్ (యాదాద్రి భువనగిరి జిల్లా ఇంఛార్జి) గుర్రాల బాలకృష్ణ ముదిరాజ్ మరియు కొండ పరమేష్, నీల మహేందర్,భరత్,శ్రీను,అరవింద్,గ్రామ కౌన్సిలర్,గ్రామ పెద్దలు,యూత్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.