ఆలేరులో ఘనంగా ప్రపంచ చప్పట్ల దినోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో మే17 (నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా లోని నియోజకవర్గకేంద్రమైన ఆలేరు పట్టణం లో ప్రపంచ చప్పట్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పెద్ద వారు, పిల్లలు, మహిళలు.రొండు చేతులు ఒక దానితో ఒకటి చరిచి చప్పట్లుకొట్టారు. అందరు ప్రతి రోజుఉదయంనిద్ర లేచినతరువాత 10నిముషాలు రాత్రి భోజనం తరువాత 15నిముషాలు రోజు కు రొండు సార్లు చప్పట్లు కొట్టడంవలన డబ్బులు లేకుండా ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆలేరు పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు అయిత. వెంకటేష్ అన్నారు మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉన్న దని మర్చి పోవద్దనిచెప్పారు కరోనా కాలంలో కూడా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడ ప్రజలందరి చేత చప్పట్లు కొట్టించారని చప్పట్ల దినోత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు మంచన. మల్లేశం గుర్తు చేశారు. పూర్వకాలం నుండి పెద్దలు ప్రతిరోజు ఆలయాలవద్ద భజనలు చేసేవారని అన్నారు.చప్పట్లతో శరీరం లో రక్త సరఫరా
సాఫిగా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం లో బాల్నే. దామోదర్, బొమ్మ శివలింగం, గోపరాజు. కొండల్, అజీమ్,శ్రీధర్, వెంకటేష్, అజ్మత్తుల్లా, గడ్డం. రేణుక, గడ్డం. యాకుబ్, మంచన. త్రిజల్ కుమార్, కుశల్ కుమార్, సహస్ర, జనిగల. అక్షయ, సరాబు అమన్, వైభవ్ తదితరులు పాల్గొన్నారు.