తాత్కాలిక అనుమతులతో అక్రమ మట్టి దందా

-నియోజకవర్గంలో అనుమతులు లేకుండా తవ్వకాలు
-కేసులు నమోదు చేసిన అదే పరిస్ధితి

సత్తుపల్లి మే 17 (నిజం న్యూస్)

ఇల్లు కట్టాలంటే మట్టి కావాలి… ఫ్లాట్ చేయాలన్నా మట్టి కావాలి…రోడ్డు నిర్మాణానికి నిర్మాణం పూర్తయ్యాక ఇరువైపులా లెవల్ చేయడానికి.. ఇలా ప్రతి అవసరానికి మట్టి కీలకం….దీంతో నిత్యావసర వస్తువుల జాబితాలో అది ఒకటిగా చేరిపోయింది అయితే డిమాండ్ కు తగ్గట్టు అందుబాటులో లేకపోవడంతో ఇసుకను మించిపోతుంది.అదే అదనుగా భావిస్తున్న అనేకమంది నియోజకవర్గంలో అక్రమ మట్టి దందాలు కొనసాగిస్తున్నారు.కొంత మంది తాత్కాలిక పర్మిట్లు తీసుకుని గడువు దాటిన తర్వాత కూడా మట్టి తోవ్వుతూనే ఉన్నారు.

Also read : సద్దుల చెరువు ట్యాంక్ బండ్ పై కలియతిరుగుతూ విజిటర్స్ తో మంత్రి మాటా-మంతీ

మరికొందరు అనుమతి లేకుండా ప్రభుత్వ భూములలో అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు.మట్టి తవ్వాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ముందుగా ఆన్లైన్ పద్ధతిలో మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దాని ప్రకారం తాసిల్దార్ క్వారీ నిర్వహణకు ఎం ఓ సి ఇస్తే దానిని బట్టి మైనింగ్ అధికారులు తాత్కాలిక అనుమతి ఇస్తారు అంటే నిర్దేశిత క్యూబిక్ మీటర్ల మేరకు మాత్రమే మట్టిని తవ్వాలి.కానీ కొంత మంది తాత్కాలిక పర్మిట్లు తీసుకుని గడువు దాటిన తరువాత కూడా అదే పేరుతో నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు మట్టి తవ్వకాలు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది అయితే ఎటువంటి అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లోనే కాక అటవీ భూముల్లో కూడా కొంతమంది మట్టి తవ్వకాలు చేపడుతూ మట్టి దందాకు పాల్పడుతున్నారు. నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు,పెనుబల్లి,కల్లూరు తల్లాడ మండలాలలో యదేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు తెలియజేశారు. కొన్నిచోట్ల అధికారులు తనిఖీ చేసి కేసులు నమోదు చేయడం జరిగింది కానీ అడపాదడపా మాత్రమే చర్యలు తీసుకోవడం వల్ల మట్టి తవ్వకాలు నిత్యకృత్యమయ్యాయి. చాలామంది ఒకటి అర అనుమతులు తీసుకుని గుట్టలను కరగా తీయడం గమనార్హం.