సద్దుల చెరువు ట్యాంక్ బండ్ పై కలియతిరుగుతూ విజిటర్స్ తో మంత్రి మాటా-మంతీ

మంత్రి జగదీష్ రెడ్డి ఆకస్మిక సందర్శన
ట్యాంక్ బండ్ పై కావాల్సిన సదుపాయాలపై ప్రజలను ఆడిగితెలుసుకున్న మంత్రి
చిన్నారులు, యువకులతో మంత్రి సరదా ముచ్చట్లు
సూర్యాపేట
సూర్యాపేట కు మణిహారం గా ఉన్న సద్దుల చెరువు ట్యాంక్ బండ్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.స్వయంగా ట్యాన్క్ బండ్ పై కలియతిరుగుతూ పాదచారులకు, విజిటర్స్ కు కావాల్సిన సదుపాయాలపై మంత్రి ఆడిగి తెలుసుకున్నారు.
Also read: తీన్మార్ మల్లన్నపై రూ.10 కోట్లకు మంత్రి పువ్వాడ పరువు నష్టం దావా
తమకు ,సౌకర్య వంతంగా ,ఆహ్లాదకరంగా ఉండేలా సద్దుల చెరువు ను ట్యాంక్ బండ్ లా తీర్చిదిద్దిన మంత్రి కి పాదచారు లు , యువకులు కృతజ్ఞతలు తెలిపారు..ట్యాంక్ బండ్ పై కూర్చోవడానికి వీలుగా సీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా ,దానికి మంత్రి సానుకూలంగా స్పందించారు.. త్వరలోనే ట్యాంక్ బండ్ పై అధునాతన సీటింగ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు…గంట సేపటికి పైగా ట్యాంక్ బండ్ పై కలియతిరిగిన మంత్రి యువకులు ,చిన్నారులతో సరదా గా ముచ్చటించారు… అనంతరం లోయర్ సద్దుల చెరువు ట్యాంక్ బండ్ క్రింద సాగుతున్న కాలువ పనులను పరిశీలించి, త్వరగా పనులు పూర్తయ్యే విదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. మంత్రి వెంట జడ్పిటిసి జీడీ బిక్షం, తదితరులు ఉన్నారు..