మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో రికార్డుల తనిఖీ

యాదాద్రి జిల్లాలో స”హ” చట్టం ధరఖాస్తుకు అధికారుల స్పందన

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో మే 17 (నిజం న్యూస్)
సమాచార హక్కు చట్టం క్రింద చేసిన ధరఖాస్తుకు కోరిన సమాచారం ఇవ్వడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా నేరుగా తమ కార్యాలయానికే వచ్చి కావాల్సిన రికార్డులు తనిఖీ చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి అనుమతినిచ్చారు. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఇదే జిల్లాకు చెందిన పోతుగంటి సంపత్ కుమార్ సిడిపిఓ ల టూర్ డైరీ, లాగ్ బుక్స్, టిఏ,డిఏ, హెచ్ఆర్ మరియు సర్వీసు బుక్ వివరాల కొరకు ధరఖాస్తు చేసుకున్నాడు.

also read: ఎన్టీపిసి మైనారిటీ గురుకుల విద్యార్థి అనుమానాస్పద మృతి 

ధరఖాస్తు అందుకున్న పౌరసమాచార అధికారి కోరిన సమాచారంలో కొంతవరకు వ్యక్తిగత వివరాలు ఉన్నాయని అయినప్పటికీ సదరు వివరాల కొరకు కార్యాలయానికి వచ్చి సంబంధిత రికార్డులు తనిఖీ చేసుకుని అవసరమైన సమాచారాన్ని తీసుకోవాలని ధరఖాస్తుకు సమాధానం ఇచ్చారు. అయితే ఏ తేదీన రికార్డుల తనిఖీ నిర్వహించుకోవచ్చో ధరఖాస్తుదారునికి సూచించలేదు. దీంతో ధరఖాస్తుదారుడే ఈ నెల 25 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సీనియర్ ఆర్టీఐ ఆక్టివిస్ట్, అంతర్జాతీయ మానవహక్కుల మరియు నేర నిరోధక శాశ్వత సభ్యుడైన గంగాధర కిశోర్ కుమార్ తో కలిసి రికార్డుల తనిఖీ కొరకు వస్తున్నామని కార్యాలయానికి ముందస్తు సమాచారం ఇచ్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సమాచార హక్కు చట్టం క్రింద రికార్డుల తనిఖీకి అధికారులు అనుమతించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.