ఎన్టీపిసి మైనారిటీ గురుకుల విద్యార్థి అనుమానాస్పద మృతి 

ఎన్టీపిసి మైనారిటీ గురుకుల విద్యార్థి అనుమానాస్పద మృతి

పలు అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబీకులు

నిజం న్యూస్ : పెద్దపెల్లి

ఎన్టీపిసి మైనారిటీ గురుకుల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధి కాలేజ్ భవనం పై నుండి మొన్నరాత్రి పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు … కాలేజ్ భవన్ పై నుండి పడిన విద్యార్ధి రావూఫ్ ని ఆటో లో తీసుకచ్చి తమ కుటుంబీకులకు చెప్పకుండా ఆసుపత్రిలో చేర్పించారని దీనికి ప్రిన్సిపాల్ వార్డెన్ బాధ్యత వహించాలి మృతుని బంధువులు ఎన్.ఎస్ .యు .ఐ యువజన కాంగ్రెస్ ఎబివిపి పలు విద్యార్ధి సంఘాలు ఆందోళన నిర్వహించి రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు … విద్యార్థులు అర్ధరాత్రి కాలేజ్ భవనం పైకి ఎక్కితే ప్రిన్సిపాల్ వార్డెన్ లు ఎందుకు బాధ్యత రాహిత్యం గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు .. పరీక్షల సమయం లో విద్యార్థులు

గదిలో ఉన్నారో లేదో హాజరు నిర్వహించల్సిన సిబ్బంది తమకొడుకు విద్యార్థులు భవనం పైకి స్వేచ్ఛగా తిరిగేలా గాలికి వదిలేసి విధులు నిర్వహించాల్సిన కాలేజ్ యాజయాన్యం నిర్లక్ష్యం గా వ్యహరించారని మృతుని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది . విద్యార్ధి సంఘాలు కుటుంబీకులు పలు ప్రజా సంఘాల ఆందోళనల మధ్య శవ పంచనామా నిర్వహించి మృతు దేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు .

మృతుని కుటుంబాన్ని రామగుండము ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కాంగ్రెస్ పార్టీ రామగుండము నియోజకవర్గ ఇంచార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ పరామర్శించారు .

మృతుని కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి మృతుని తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఎబివిపి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అన్వేష్ డిమాండ్ చేశారు .. యువజన కాంగ్రెస్ రామగుండం అధ్యక్షులు ఉపాధ్యక్షులు వాజిద్ ఖాన్ నజీమ్ రావూఫ్ మృతికి ప్రిన్సిపాల్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.. ఎన్ ఎస్ యు .ఐ నాయకులు ఉదయ్ రాజు మాట్లాడుతూ నిర్లక్ష్యం గా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ని ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు .రాస్తారోకో చేసి ఆందోళన చేపట్టిన వారిలో కాంగ్రెస్ నాయకులు ఫక్రుద్దీన్ రహీం ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు ఉన్నారు .