Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కరీంనగర్ పలు మాల్స్ లో బాంబు కలకలం

కరీంనగర్ జిల్లా ప్రతినిధి, మే 16(నిజం న్యూస్):

కరీంనగర్ లోని పలు మాల్స్ లో బాంబులు పెట్టామన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుర్తు తెలియని వ్యక్తుల ద్వార అందిన సమచారంతో హుటాహుటిన పోలీసులు మాల్స్ లో తనిఖీలు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండె మాంగల్య, సౌత్ ఇండియా, వీఆర్కె షాపింగ్ మాల్స్ లో సమాచారం అంధుకొవడం తో కరీంనగర్ ఎసిపి తుల శ్రీనివాసరావు అధ్వర్యంలో సోదాలు చేపట్టారు.

also read : పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు…..జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

బాంబు తనిఖీ అధికారులచె తనిఖీలు చేపట్టి బాంబు లేదని నిర్ధారించారు. మాల్స్ లో వినియోగదారుల కోసం తీసుకోవలసిన రక్షణ చర్యలపై పోలీసులు మాల్స్ యజమానులకు సూచనలు జారీ చెసారు. మెటల్ డిటెక్టర్ల తో పాటు ఇతర రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే బాంబు బెధిరింపులపై పాల్పడిన వారి గురించి ఆరా తీస్థున్నమని పోలీసులు తెలిపారు.ఇకపై ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.