రాష్ట్ర స్థాయిలో పథకాల పంట పండించిన యాదాద్రి అథ్లెటిక్స్ బృందం

రాష్ట్ర స్థాయిలో పథకాల పంట పండించిన యాదాద్రి అథ్లెటిక్స్ బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో మే 16 (నిజం న్యూస్)
మే14 మరియు 15 న GMC బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియం గచ్చిబౌలి లో జరిగిన 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పురుషుల, మహిళల, అండర్ -20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో యాదాద్రి భువనగిరి జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి 3 బంగారు పథకాలు, 4 వెండి పథకాలు, 2 కాంస్య పథకాలు సాధించారు.
ఇట్టి పోటీలలో జిల్లాను 4వ స్థానంలో నిలిపారని జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శిలు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కోనేటి గోపాల్ గార్లు సంయుక్త ప్రకటనలో తెలిజేశారు. ఈ సందర్భంగా పోతంశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన అథ్లెట్స్ ను అభినందిస్తూ వారికి శిక్షణ అందించిన శిక్షకులను అభినందించారు. భవిష్యత్లో మరిన్ని పథకాలు జిల్లాకు రాష్ట్రస్థాయిలో మరియు జాతీయ స్థాయిలో కూడా పథకాలు తీసుకురావాలని కోరారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ అథ్లెట్స్ కి సహాయసహకారాలు అందిస్తుందని తెలియజేశారు.20 సం.లోపు జూనియర్ మహిళలు ఎం. మల్లిక 3000 ప్రథమ, 1500 ద్వితీయ , హిమ సింధు షాట్ పుట్ మరియు డిస్స్కస్ త్రో ప్రథమ పురుషులు జి. సాయి కుమార్ 1500మీ. 5000మీ. తృతీయ , జి. సాయి సచిన్ డిస్కస్ త్రో తృతీయ, డి. మహేష్ లాంగ్ జంప్ ద్వితీయ, ఏ. అనిల్ కుమార్ షాట్ ఫుట్ ద్వితీయ, జె. రాజు డిస్కస్ త్రో ద్వితీయ సాధించిన క్రీడాకారులను అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి గోపాల్ గారు, జిల్లా కోశాధికారి గోనురు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు మాటూరి వినోద్, కె. వెంకటరమణ, టి. ఉపేందర్, సంయుక్త కార్యదర్శులు ఏ. అనిల్ కుమార్, ఎ. యాదగిరి, కె. వీరేశం, కార్యవర్గ సభ్యులు కబీరుద్దీన్, దేవేందర్, వీణ, లావణ్య, గోపి ,కరుణాకర్, ప్రదీప్ మహేష్, నరేందర్, గణేష్, కౌశిక్, గురునాధ్, నిఖిల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.