జోహార్ కామ్రేడ్ మారోజు వీరన్న

నేడు వీరన్న 24వ వర్ధంతి.

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం అన్న మహనీయుడు, మారోజు.

తుంగతుర్తి మే 16 నిజం న్యూస్

పీడిత జన సామాజిక విప్లవకారుడు, మలిదశ తెలంగాణ పోరాట ఆద్యుడు, కుల వర్గ జమిలి పోరాటాల నిర్మాత మారోజు వీరన్న పుట్టిన గడ్డ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో జన్మించి, ప్రజా సమస్యలపై నిరంతరంగా పోరాటం చేసి, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని తెలియజేసి, రాజకీయ చదరంగంలో, ఎన్నో కష్టాలు అనుభవించి, చివరకు పోలీసుల ఎన్కౌంటర్లో మృతుడై, భౌతికంగా దూరమై 23 సంవత్సరాలు అవుతున్నది..

 

1999, మే 16న∙కరీంనగర్‌ జిల్లా నర్సింగాపూర్‌లోని మామిడితోటలో అర్థరాత్రి రాజకీయ హత్య గావించిన పోలీసులు ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిం చారు. దళిత బహుజన ఆవేశాన్ని చల్లారుస్తూ.. అప్రకటిత ఎమర్జెన్సీ పాలనా సాగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పల్లె పల్లెన శ్మశాన శాంతిని నెలకొల్పింది. ఎర్ర పోరాటానికి నీలి మెరుపులు అద్దిన వీరన్న అస్తిత్వ పోరాటాలకు దిక్సూచిగా నిలిచాడు.

23 ఏళ్లుగా వీరన్న భౌతికంగా లేకున్నా ప్రతి అస్తిత్వ పోరాటంలో సజీవంగా ఉన్నాడు. భారత విప్లవ పోరాట పంథాను కుల నిర్మూలన ఫలకంపై నిర్మించడంలో విఫలం అయ్యి ప్రజ లకు దూరమవుతున్నారనే వీరన్న ఆయన అనుయాయుల విమర్శతోనే నేటి కమ్యూనిస్టులు అంబేడ్కర్‌ను ఎత్తిపడుతున్నారా అనేది చర్చనీ యాంశం. వీరన్న కుల వర్గ జమిలి పోరాట సూత్రాన్ని అన్వయించుకొని నేడు లాల్‌–నీల్‌ ఐక్యత పోరాటంగా ముందుకు సాగుతున్న పార్టీలు సైతం ఎన్నికలను ఎదుర్కోవడం కోసం ఎత్తుగడనా? లేక సైద్ధాంతికంగానే పంథాను మార్చుకున్నాయా అనేది నేడు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అంశం. శ్రామిక వర్గ దృక్పథం లేని కుల పోరాటాలు, కుల నిర్మూలన లక్ష్యం లేని వర్గ పోరాటాలు విముక్తి సాధించలేవు.

కనుక వీరన్న చూపిన రాజకీయ సైద్ధాంతిక వెలుగులో పురోగమించడమే ఆయన స్మృతిలో నిజమైన నివాళి చెప్పాలి సుమా….