బుల్లెట్ పైనుండి పడి వ్యక్తి మృతి

తలకు బలమైన గాయం కావడంతో రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి.

మద్దిరాల మే 15 నిజం న్యూస్

బుల్లెట్ పై నుండి పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మద్దిరాల మండల పరిధిలోని రామచంద్రపురం లో చోటు చేసుకుంది…

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రపురం గ్రామానికి చెందిన నాగవల్లి శ్రవణ్ కుమార్ కుమారుడైన నాగవల్లి. అరుణ్ ( 28), రాత్రి తుంగతుర్తి నుండి రామచంద్రపురం కు వెళుతుండగా మార్గమధ్యంలో లో బుల్లెట్ ఒక్కసారిగా అదుపు తప్పడంతో ప్రక్కనే ఉన్న మురికి కాలువ లో పడిపోవడంతో, తలకు బలమైన గాయం తో రక్తస్రావం జరిగింది. దీన్ని రాత్రి ఎవరు గమనించక పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు తెలియపరిచారు. పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించి, కేసు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనితో తుంగతుర్తి, రామచంద్రపురం లో ప్రతి కుటుంబానికి అరుణ్ పరిచయం ఉండడంతో, మృత దేహం వద్ద రోదనలు అలుముకున్నాయి.