కన్న కొడుకులకు కనికరం లేకపాయే..?

వృద్ధురాలు సత్తమ్మ పింఛన్ కూడా మాయం చేస్తున్న కొడుకులు…

ఉదయం ,రాత్రి చెట్ల కిందనే జీవనం… పట్టించుకునే నాథుడే లేకపాయె… న్యాయం చేయాలని అధికారులకు వేడుకోలు.

తుంగతుర్తి మే 14 నిజం న్యూస్

అమ్మే మా ప్రాణం.. అమ్మ నే. మా జీవితం అని ప్రగల్బాలు పలుకుతున్న తరుణంలో తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన నాగవల్లి సత్తమ్మ. కు ఇరువురు కుమారులు. గత కొంత కాలంగా పోలీస్ స్టేషన్ కు సమీప దూరంలో తనకు ఉన్న పాత ఇంటిలో, అడుక్కొని తెచ్చుకున్న కూరలతో, ఆమె స్వయంగా వంట వండుకొని, కొన్ని సంవత్సరాల క్రితం నుండి జీవనం సాగిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పింఛన్ అక్షరాల2 వేలు పొందుతున్నది. ఏదో కొద్దో గొప్పో జీవనం సాగిస్తున్న ఈ మధ్యకాలంలో చిన్న కొడుకు పాత ఇంటిని తీసివేసి, కొత్తగా ఇంటిని నిర్మించుకున్నాడు. దీనితో ఈ వృద్ధురాలు కు కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం ఈమె పరిస్థితి మండుటెండలో సైతం చెట్ల కిందనే జీవనం సాగిస్తుంది. రాత్రి వేళలో సైతం ఏ చెట్టు నీడ నా బ్రతకాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ పాపం ఎవరిది అని సమాజం ప్రశ్నిస్తుంది.. ప్రస్తుతం ఈమెను ఇంటికి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, నాకు పింఛన్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని, శనివారం ఉదయం సాక్షాత్తు తుంగతుర్తి పోలీస్స్టేషన్ ఎదుట ఉన్న సర్కారు తుమ్మ చెట్టు నీడలో దీనంగా కూర్చున్నది. ఇకనైనా సంబంధిత అధికారులు న్యాయం చేయాలని కన్నీటి పర్వం తో కోరుతున్నది.