మానవత్వం చాటిన పెన్ పహాడ్ మండల ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్

పేద ప్రజల పట్ల దయామయుడు ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్.
సూర్యాపేట ఏప్రిల్ 10 నిజం న్యూస్
ఇటీవల కాలంలో చీదెళ్ళ గ్రామంలో అకస్మాత్తుగా కొండమీది శ్రీకాంత్ చనిపోవడం తో వారికి భార్య,1 సంవత్సరం పాప,3సంవత్సరాల బాబు పిల్లలకు చూసి తన మనసు చలించిపోయి దయా హృదయం కలిగి వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని చీదేళ్ళ గ్రామ వాసులు అయిన పందుల నాగరాజు గౌడ్, గొబ్బి రమేష్ ద్వారా భార్య పిల్లల పేరు మీద ఫిక్సడ్ డిపాజిట్ కొరకు కొంత డబ్బును అందించినందుకు, వారికి వారి కుటుంబం నుంచి ,చీదేళ్ళ గ్రామం నుంచి ప్రజలు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ చేస్తున్న సేవల పట్ల, ధన్యవాదాలు తెలియయజేశారు.. ఏది ఏమైనా గతంలో కూడా తుంగతుర్తి మండలంలో పేద ప్రజలకు నేనున్నానని ముందుకు వచ్చి సేవలు చేయడం గమనార్హం.. శ్రీ కాంత్ గౌడ్ కీ… సెల్యూట్ చేయక తప్పదు సుమ..