మండాలపాడు బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ డ్రైవర్ మృతి 

మండాలపాడు బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

పెనుబల్లి మే 10 (నిజం న్యూస్):

పెనుబల్లి మండలం మండాల పాడు బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వస్తే ట్రాక్టర్ డ్రైవర్ రావూరి శివాజీ (27).జీవనాధారం కోసం మండాలపాడు గ్రామానికి చెందిన కర్రీ రామారావు దగ్గర ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.మంగళవారం నాడు ఉదయం 5.30 సమయంలో పొలం పనుల నిమిత్తం ట్రాక్టర్ పై వెళుతున్న శివాజీ ను అటుగా వెళ్తున్న టిప్పర్ లారీ బలంగా ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలానికి వి.ఎం.బంజర్ ఎస్.ఐ సూరజ్ చేరుకొని కేసు నమోదు చేస్తున్నారు.