Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.25,000/- ఆర్థికసాయం అందించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ .

మోత్కూర్ ఫిబ్రవరి 9 నిజం న్యూస్

మోత్కూరు మున్సిపాలిటీ 2వ వార్డుకు చెందిన గుంటి రమేష్ , కుమార్తె వివాహ వేడుకకు ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ఆహ్వానించడంతో వారి కుటుంబ పరిస్థితిని స్థానిక నాయకులను అడిగి తెలుసుకొని, ఆ పేదింటి ఆడబిడ్డ ,వివాహం ఖర్చుల కొరకు తన వంతు సహాయంగా ₹25,000/- (ఇరవై ఐదు వేల రూపాయలు) ఆర్థికసాయం అందజేశారు. ఏది ఏమైనా ఆపదలో ఉన్నవారికి నేనున్నానని ధైర్యాన్ని, కల్పిస్తూ ఆర్థిక సహాయం అందించడం అభినందనీయం. దీంతో కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజలు ,హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మర్రి అనిల్,బొడ శ్రీను,గుంటి దేవా తదితరులు పాల్గొన్నారు