సినిమా ఫక్కీలో పోలీసుల చేజింగ్.. దొరికిన జింకలు

కామారెడ్డి లో సినిమా ఫక్కీలో పోలీసుల చేజింగ్

40 కిలోమీటర్లు చేజ్ చేసి వేటగాళ్లు ను పట్టుకున్న పోలీసులు

కామారెడ్డి ఏప్రిల్7 నిజం న్యూస్

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని కోమటిపల్లి ఐలాపూర్ అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తూ డ్యూటీ లో ఉన్న శంకర్ రాం మోహన్ హోమ్ గార్డ్ వసంత్ లకు అనుమాణితంగా కనిపించిన ఏర్టిగా ,స్విఫ్ట్ వాహనాలు కనిపించగా ఎల్లారెడ్డి సి ఐ శ్రీనివాస్ కు సమాచారం అందిచడంతో సి ఐ , ఎస్ ఐ వాహనాలతో వెంబడించగా ఏరిటీగా వాహనాన్ని ఐలాపూర్ రైస్ మిల్ వద్ద వదిలేసి పారిపోయినారు.  వాహనంలో జింకలు కనిపించడంతో ఆ ఏరియా సోదా చేయగా అనుమానంగా కనిపించిన మహమ్మద్ హమీద్ 48 రైఫైల్ దొరకడంతో అదుపులోకి తీసుకుని విచారించగా పూర్తి సమాచారం ఇవ్వడంతో అలెర్ట్ అయిన సిఐ శ్రీనివాస్ జిల్లా పోలీసు అధికారులను అలెర్ట్ చేసి జిల్లాను దిగ్బంధనం చేయడంతో మాచారెడ్డి ఫరిద్ పెట్ ఏరియాలో మిగిలిన 6 గురు వారికి సహకరించిన ముగ్గురిని సినిమా ఫక్కీలో చేజ్ చేసి పట్టుకోవడం జరిగిందన్నారు. నిందితులకు నాన్ బెయిల్ సెక్షన్ల పెట్టడం జరిగిందన్నారు. ఇది ఫారెస్ట్ శాఖ కు సంబంధించిన విషయం కాగా అధికారికంగా అప్పగించడం జరిగిందన్నారు.

మహమ్మద్ అమీర్ ఉజ్వన్ లైసెన్స్ గన్ స్వాధీనం చేసుకుని లైసెన్స్ రద్దు చెపిస్తామని అన్నారు.