రైతు యేసుతో మంత్రి ,ఎమ్మెల్యే తో ముఖాముఖి

రైతు యేసుతో మంత్రి ,ఎమ్మెల్యే ముఖాముఖి

రైతుల కళ్లలో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం… మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్.

తుంగతుర్తి, ఏప్రిల్ 6 నిజం న్యూస్

మహబూబాబాద్ వెళ్లి వస్తున్న మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి , ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ మార్గమధ్యంలోనీ ఎర్రపాడ్ క్రాస్ రోడ్డు వద్ద వరి ధాన్యం నేర్పుతున్న రైతుల చూసి అక్కడికక్కడే వాహనాన్ని ఆపి రైతుతో మాట్లాడుతూ ఈసారి యాసంగి పంట ఎం వేసవ్ అంటూ మంత్రి అడుగడంతో…

రైతు: ఇక్కడ మీరు, ఎమ్మెల్యే రైతు బిడ్డ పెద్ద సారు సీఎం కేసీఆర్ ఉన్నారన్న ధైర్యంతోనే నాకు ఉన్న రెండు ఎకరాల్లో ,దొడ్డు ఒడ్లు వేశాను సారు.. అంటూ చాలా సంతోషంగా కాసేపు మంత్రి జగదీష్ రెడ్డి , ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ మాట్లాడిన పోలుమల్ల గ్రామానికి చెందిన రైతు సొప్పరి యేసు.

తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేయాలనే లక్ష్యంతో, రైతుల సమస్యలను యెరిగి, గ్రామాల్లోనే కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి, రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు… ఏది ఏమైనా రైతు ధైర్యముతో, వ్యవసాయం కోసం సాగునీరు ఉచిత కరెంటు, పండించిన పంట కొనుగోలు చేస్తుంటే ఇక మాకేం బాధలు ఉంటాయని, సమస్యలు ఉంటే మా ఎమ్మెల్యే చూసుకుంటారని , ఆనందంతో మంత్రి ,ఎమ్మెల్యే కు జవాబు చెప్పడం గమనార్హం…