చెడ్డీ గ్యాంగ్ సభ్యులలో మరో కీలక నిందితుడి అరెస్ట్

విజయవాడ : బ్యూరో మే 06 (నిజం న్యూస్ )
నగర శివారు ప్రాంతాలలో జరిగిన దొంగతనాల పై ప్రత్యేక దృష్టి సారించిన నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు దొంగతనాల నియంత్రణ నిమిత్తం పోలీసు గస్తీని ముమ్మరం చేయడంతో పాటు పాత నేరస్థులు, జైలు నుండి విడుదలైన నేరస్థులు మరియు అనుమానాస్పద వ్యక్తులు మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేరస్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ క్రమంలో విజయవాడ టూటౌన్, ఇబ్రహీంపట్నం మరియు పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనం జరిగినట్లు నమోదైన కేసుల మేరకు విజయవాడ నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు పశ్చిమ జోన్ డి.సి.పి. శ్రీ కె. బాబు రావు, ఐ.పి.ఎస్., గారి ఆధ్వర్యంలో, క్రైమ్ ఏ.డి.సి.పి. కొల్లి శ్రీనివాసరావు గారి సారధ్యంలో, ఏ.సి.పి. శ్రీ చలసాని శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో సి.సి.ఎస్. క్రైమ్ ప్రత్యేక బృందాలు గుజరాత్ రాష్ట్రంలోని దాహోడ్ జిల్లా లోని గుల్బర్గా తాలూకా కి వెళ్లి చెడ్డీ గ్యాంగ్ సభ్యుల కదలికల సమాచారం సేకరించుటకు అక్కడకు వెళ్ళగా సదరు సి సి ఎస్ బృందం సేకరించిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మరో కీలక నిందితుడు విజయవాడ పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న సమాచారం మేరకు ఈ దిగువ కీలక నిందితుడి ఆచూకి కనుగొనబడి అరెస్ట్ చేయడం జరిగింది.
నిందితుని వివరాలు: కాలు రుమాల్ హతిల తండ్రి రుమాల్, వయస్సు (38సం॥) కులం:అదివాసి (కోడి), గుల్బర్ గ్రామం, గర్భదా తాలూకా, దాహూద్ జిల్లా, గుజరాత్ రాష్ట్రం.
నేరం జరిగిన విధానం
విచారణలో… నిందితులు గుల్బర్ గ్రామం, గర్భడా తాలూకా, దాహూద్ జిల్లా, గుజరాత్ రాష్ట్రమునకు మరియు ఝుబువా తాలూకా, జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రలకు చెందిన వారు. వీరు నేరానికి వచ్చేటప్పుడు నిక్కరు దరిస్తారు. కాబట్టి వీరిని చెడ్డీ గ్యాంగ్ అని పిలవబడుతున్నారు. వీరు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. కూలి పనుల కోసం రైళ్ళలో ప్రయాణ చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, అక్కడ నగర శివారు పనులు లేని సమయంలో నిర్మానుష్య ప్రదేశాలలో ఉండే ఇళ్ళు, అపార్ట్మెంట్లను పగటి సమయంలో రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో వెళ్లి ఇంటి తాళాలు పగులకొట్టి ఇళ్ళల్లో ఉన్న నగదు, బంగారం మరియు ఇతర విలువైన వస్తువులను దొంగిలించుకొని వెళుతూ ఉంటారు. ది.28.11.2021 కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధి లోని మిల్క్ ప్రాజెక్ట్ వద్ద గల ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన ఉన్న శివ దుర్గ ఎంక్లేవ్ లోని జి3 ప్లాట్ కు తాళం వేసి వుండటం గమనించి అయిదుగురు సభ్యల చెడ్డి గ్యాంగ్ బృందం ఆ అపార్ట్ మెంట్ చుట్టూ ఖాళీ ప్రదేశం వుండటం వలన ఆ అపార్ట్ మెంట్ వెనుక ఉన్న పోలాల్లో ఎవరికీ కనబడకుండా కూర్చుని రాత్రి సుమారు 2 గంటల సమయంలో (తెల్లవారితే 29 వ తేదీ వారు బట్టలు మార్చుకుని వారు తెచ్చుకున్న మారణాయుధాలతో అపార్ట్ మెంట్ గోడదూకి తాళం వేసి ఉన్న ఇంటిని పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులు, వెండి వస్తువులు మరియు డబ్బులు దొంగిలించుకుని వెళ్ళినారు.
అదే విధంగా అదే బృందం ది.01.12.2021వ తేదీన హైదరాబాద్ రోడ్డులో గల ఇబ్రహీంపట్నంలోని గుంటుపల్లి గ్రామంలో నిర్మానుష్య ప్రదేశంలో గల అపార్ట్ మెంట్లను రెక్కీ నిర్వహించుకొని అదే రోజు రాత్రి సుమరు 7 గంటల సమయంలో మారణాయుధాలతో నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరుకొని సమయంకోసం ఎదురు చూసి రాత్రి 2 గంటల సమయంలో తెల్లవారితే 2వ తేదీ వారు ప్యాంటు చొక్కాలు విప్పేసి కేవలం బన్నీలు చెడ్డీలు వేసుకొని నడుముకు టవళ్ళు కట్లుకొని ఎవరికీ కనబడకుండా అపార్ట్ మెంట్లోకి వెళ్ళినారు, అక్కడ వారు తెచ్చుకున్న మారణాయుధాలతో ఇంటి తలుపులు పగలగొడుతూ ఉండగా ఆ శబ్దానికి ఆ ఇంటిలోని వారు మరియు చుట్లు ప్రక్కల వారు లేవడంతో వారు అక్కడి నుండి పారిపోయారు.
పై రెండు కేసులకు సంబంధించి గతంలో అనగా ది.17.12.2021వ తేదీన ఎ-1 మడియా కామ్జి మేడాను అరెస్ట్ చేసి చోరీ కేసులోని కొంత సొత్తును స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్ కు పంపడం జరిగినది.
మరో కీలక నిందితుడి అరెస్ట్
విజయవాడ నగర పోలీస్ కమీషనర్ గారి ఆదేశాల మేరకు సి.సి.ఎస్. బృందం గుజరాత్ రాష్ట్రం. దాహూద్కు వెళ్ళి అత్యంత విశ్వసనీయమైన సమాచారం సేకరించి కీలక నిందితుడు అయిన కాలు రుమాల్ హతిల విజయవాడ పరిసర ప్రాంతాలలో సంచరిస్తూ అరెస్టు కాబడిన చెడ్డి గ్యాంగ్ సభ్యుల యొక్క క్షేమ సమాచారం సేకరించి వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ మరియు అరెస్ట్ కాబడిన చెడ్డి గ్యాంగ్ సభ్యులకు న్యాయ సహాయం చేయడం కొరకు విజయవాడలో సంచరిస్తున్న కాలు రుమాల్ హతిల యొక్క కదలికలను అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సి.సి.ఎస్. వారికీ సమాచారం మేరకు ఆచూకి కనుగొని విజయవాడ సి.సి.ఎస్. పోలీసులు ది.06 .05.2022వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది.
పై కేసులలో దర్యాప్తులో భాగంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయడంలో చురుగ్గా వ్యవహరించి విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని విజయవాడ నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణాటాటా, ఐ.పి.ఎస్. గారు మరియు పశ్చిమ జోన్ డి.సి.పి. శ్రీ కె. బాబు రావు ఐ.పి.ఎస్.అభినందించడం జరిగింది.