పేట వ్యవసాయ మార్కెట్ లో వైఎస్ షర్మిల నిరసన

సూర్యాపేట:

ప్ర‌జా ప్ర‌స్థానంలో భాగంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల సూర్యాపేట జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్ ను శుక్రవారం సందర్శించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ పిట్టా రాంరెడ్డి ఆధ్వర్యంలో రైతుల వడ్ల రాశుల వద్దకు వెళ్లి రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. గత నాలుగైదు రోజులుగా మార్కెట్ ధాన్యం విక్రయాల ధరను అధికారులతో అడిగి తెలుసుకొన్నారు. అనంతరం మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులకు మద్దతు ధర చెల్లించాలని, వెంట వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.