నిరుపేద కుటుంబానికి కొండంత అండగా నిలిచిన ఎమ్మెల్యే

– ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్.
తుంగతుర్తి, ఏప్రిల్ 5 నిజం న్యూస్
మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని సుందయ్య కాలనీ కి చెందిన కొనతం లక్ష్మమ్మ గారి ఇద్దరు కొడుకులు శ్రీనివాస్, వెంకన్న అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని తక్షణ మే స్పందించిన తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గురువారం మోత్కూరు లోని వారి నివాసానికి వెళ్లి, తక్షణ సాయం క్రింద ₹30,000/- (ముప్పై వేల రూపాయలు) ఆర్థికసాయం అందజేసి, కోనతం లక్ష్మమ్మ గారు 65 ఏడ్ల వృధ్యాప్యంలో అనారోగ్యంతో భాదపడుతున్న ఇద్దరు కొడుకులను కంటికి రెప్పలా కాపిడుకుంటున్న వారి కుటుంబానికి నావంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఏది ఏమైనా నియోజకవర్గంలో గ్రామాల్లో రాజకీయాలకతీతంగా ఏ కులానికి చెందిన వ్యక్తులైనా ఆపదలో ఉన్నారని తన దృష్టికి వస్తే, ఆపద్బాంధవుడు గా కుటుంబాన్ని సందర్శించి సహాయ సహకారాలు అందిస్తున్న మనసున్న మారాజు ఎమ్మెల్యే గాదరి కిషోర్ సేవల పట్ల కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, మేధావులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. జయహో.. కిషోర్ అన్న.