నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి- జిల్లా కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి మే 1(నిజం న్యూస్)

షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత కోచింగ్ కేంద్రంలో నేరుగా ప్రవేశం కల్పించబడిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వము జారీ చేయనున్న వివిధ ఉద్యోగ నియామకాల కొరకు గ్రూప్ 1,2,3,4, ఫౌండేషన్ కోర్సులలో దాదాపు (100) మంది షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతీ యువకులకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణా కేంద్రము ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిలో ఇంకా ఖాళీలు ఉన్నందున ఉత్సాహవంతులైన, ఆసక్తి కలిగిన యాదాద్రి భువనగిరి జిల్లా లోని షెడ్యుల్డ్ కులములకు చెందిన,డిగ్రీ లో ఉత్తరత పొందిన యువతీ యువకులు తమ విద్యార్హతల సర్టిఫికేట్లు తీసుకొని “స్తాన్ ఫోర్డ్ మహిళా డిగ్రీ కళాశాల, పద్మజా హాస్పిటల్ దగ్గర భువనగిరి” నందు నేరుగా విద్యార్హతల ధృవీకరణ పత్రములను పరిశీలించుకొని అక్కడే ప్రవేశం పొందవచ్చునని, సీట్లు ఉన్నంత వరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రవేశం చొప్పున అడ్మిషన్ ఇవ్వబడుతుందని తెలిపారు.ఇతర వివరాలకు కార్యాలయ సూపరింటెండెంట్ ఫోన్ నెంబర్ 9966000972 సంప్రదించాలని ఆమె అట్టి ప్రకటనలో తెలిపారు.