ఆలేరు పోలీస్ స్టేషన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 29 (నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా
ఆలేరు పోలీస్ స్టేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2021 సంవత్సరానికి ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏటా దేశవ్యాప్తంగా 75 పోలీస్ స్టేషన్లో ప్రాథమికంగా ఎంపిక చేసి వాటి పనితీరు ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది. వీటిలో ఆలేరు పోలీస్ స్టేషన్ గ్రామీణ విభాగంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ ఎంపిక చేశారు.
also read: భవనం కూలి ముగ్గురు మృతి
జాతీయ స్థాయిలో ప్రకటించిన పది ర్యాంకుల లో ఈ స్టేషన్ కు స్థానం దక్కింది.మహిళలపై దాడులు, అఘాయిత్యాలు ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పై త్వరగా పరిశోధన పూర్తి చేసి నూరుశాతం చార్జిషీట్లు దాఖలు చేయడం.
2021 సంవత్సరం లో నమోదైన కేసులలో నూరు శాతం ఎప్పటికప్పుడు నమోదు చేయడం, ఫిర్యాదుదారూలతో మర్యాదగా ప్రవర్తించడం, పోలీస్ స్టేషన్లో పచ్చదనం పరిశుభ్రత, సైన్ బోర్డులు ఏర్పాటు,బాధితుడు స్టేషన్లో ఫిర్యాదు చేయడం నుంచి ఛార్జీషీట్ దాఖలు చేసే వరకు పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాడం లాంటి అంశాల్లో,ఆలేరు పోలీస్ స్టేషన్ 100 శాతం మార్కులు సాధించి,రాష్ట్రంలోని ఉత్తమంగా నిలిచింది.
ప్రత్యేక అభినందనలు…..
తెలంగాణ రాష్ట్రం రాచకొండ కమిషనరేట్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ కు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డు అందుకోవడం యాదాద్రి భువనగిరి జోన్ పోలీస్ అధికారులకు మరియు పోలీస్ సిబ్బంది కి జర్నలిస్టుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు.