భవనం కూలి ముగ్గురు మృతి

ఒకరికి గాయాలు..
యాదగిరిగుట్ట ఏప్రిల్ 29 (నిజం న్యూస్)
యాదగిరిగుట్టలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది.ఈ భవనంలో ఇళ్లు, దుకాణాలు ఉన్నట్లు తెలుస్తుండగా ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కి తరలించారని ప్రాథమిక సమాచారం.భవనం శిథిలాల్లో మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తుండగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.