అథ్లెటిక్స్ విభాగంలో రాణించిన దళిత ముద్దుబిడ్డ ఆకారపు యువరాజ్

అథ్లెటిక్స్ విభాగంలో రాణించిన దళిత ముద్దుబిడ్డ ఆకారపు యువరాజ్
ప్రతిరోజు తుంగతుర్తి లో పరుగుపందెం చేసేవాడు.
తుంగతుర్తి, ఏప్రిల్ 29 న్యూస్
అథ్లెటిక్స్ అసోసియేషన్ ఖమ్మం, ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయిలో నాలుగు వందల మీటర్ల పరుగు పందెం విభాగంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తరపునుండి ప్రాతినిధ్యం వహించిన *ఆకారపు యువరాజ్ తండ్రి భాస్కర్, న తుంగతుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండగడపుల యాకయ్య , పాఠశాల ఉపాధ్యాయులు, ఆకారపు యువరాజును ప్రశంసించారు. ముందు ,ముందు రాబోయే రోజుల్లో తెలంగాణ స్టేట్ కు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా *జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఫిజికల్ డైరెక్టర్ కొండగడుపుల యాకయ్య సన్మానించడం జరిగింది.
అదేవిధంగా మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల చిత్రపటాన్ని మరియు హైటెక్ విజయ రహస్యం పుస్తకాలను పాఠశాల లైబ్రరీకి బహుమతిగా ఇవ్వడం జరిగింది.ప్రధానోపాధ్యాయులు రావులపల్లి జి వెంకట్ రెడ్డి కోట సహదేవ్ లతో పాటు మేధావులు, వివిధ పార్టీ నాయకులు, యువకులు హర్షం వ్యక్తం చేశారు.