అంగన్ వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి

గర్భిణీ స్త్రీల తో మరియు బాలింతల తో సమావేశం పిల్లల ఎదుగుదల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించిన జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి*
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 29 (నిజం న్యూస్)
భువనగిరి పట్టణ 23వ వార్డు 22వ వార్డులకు సంబంధించిన ఇందిరానగర్ లో అంగన్ వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి,జాయింట్ కలెక్టర్ దీపక్ తివారి సందర్శించి అంగన్ వాడి కేంద్రంలో స్థానిక కౌన్సిలర్లు పడిగెల రేణుక, బోర రాకేష్ ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గర్భిణి స్త్రీలు, బాలింతల సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి పాల్గొని మాట్లాడుతూ బాలింతలు పుట్టిన బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి తల్లిపాలు రావడంలేదని పిల్లలకు డబ్బా పాలు ఇవ్వకూడదు తల్లిపాలు ఇస్తూ ఉంటనే పాలు వస్తాయి.పుట్టిన బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి.పిల్లలు ఎదుగుదల నాణ్యమైన పోస్టింగ్ ఆహారం అందించాలి. పాలు పండ్లు గుడ్డు అంగన్వాడీ కేంద్రాల ద్వారా వచ్చే వసతులన్నీ వాడుకోవాలి.పిల్లలు పెంపకంలో తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లల పైన శ్రద్ధ వహించి బాధ్యతగా చూసుకోవాలి.గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి.డెలివరీ అయ్యేంతవరకు కూడా వీలైనంత పనులు చేసుకోవాలి గర్భిణి స్త్రీలు నార్మల్ డెలివరీ అయ్యేటట్లుగా డాక్టర్లకు సహకరించాలి.ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు చేసుకోవాలి.ఉదయం, సూర్యోదయం అయ్యేటప్పుడు అట్టి కిరణాల సమయంలో పుట్టిన పిల్లలను సూర్యకిరణాలు పడేవిధంగా ఉంచాలి మరియు గర్భిణీ స్త్రీలు సూర్యకిరణాలు పడుతున్న సమయంలో వ్యాయామం చేయాలి.అలాగే మన పరిసర ప్రాంతాలలో ఆహ్లాదకరంగా ఉండేవిధంగా మొక్కలను పెంచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ స్వరాజ్యం,సూపర్వైజర్లు లక్ష్మి,లలిత,టీచర్లు నిర్మల,భారతి,రాధిక విజయలక్ష్మి, ఇందిరా నగర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.