రేవంత్ రెడ్డికి దారి పొడవున భారీగా స్వాగతం.

నల్లగొండ ఎప్రిల్ 29.(నిజంన్యూస్): నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించే రైతు సంఘర్షణ మహాసభ సన్నాహక సమావేశానికి బాగంగా నాగార్జున సాగర్ కి వెళ్తున్న టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి దారి పొడవున నాయకులు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలుకుతున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రేవంత్ రెడ్డికి చింతపల్లి వద్ద భారీ పూలమాలతో కార్యకర్తలు రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు.
ఇప్పటికే సాగర్ కి చేరుకున్న ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి,మాజీ సిఎల్పి నేత జానారెడ్డి,మాజీ మంత్రులు గీతారెడ్డి,దామోదర్ రెడ్డి, మరియూ కాంగ్రేస్ పార్టి శ్రేణులు.