కోటి మహిళా కళాశాలను మహిళా యూనివర్సిటీ గా ప్రకటించడం పట్ల విద్యార్థుల హర్షం

 

కళాశాలలో డ్యాన్స్ చేస్తూ ఆనందం ప్రకటించిన విద్యార్థులు.

హైదరాబాద్ ,ఏప్రిల్ 26నిజం న్యూస్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేసిఆర్ కోఠి మహిళా కళాశాలను “మహిళా యూనివర్సిటీగా” ప్రకటించిన సందర్భంగా, మంగళవారం రోజున హైదరాబాదులోని కళాశాలలో మహిళా విద్యార్థులు, కేసీఆర్ చిత్ర పటంతో ,నృత్యాలు చేస్తు తమ ఆనందాన్ని ప్రకటించారు ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఎంతో మంది మహిళా పేద కుటుంబాలు విద్యలో రాణించడానికి, దోహదం పడటం పట్ల వివిధ రాజకీయ పార్టీ నాయకులు, మేధావులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.