వడ దెబ్బతో వ్యక్తి మృతి

నడిగూడెం ఏప్రిల్ 25 నిజం న్యూస్
మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన నెలమర్రి యాకోబు (37) వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.దినసరి కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగించే యాకోబు రోజువారీ
పనిలో భాగంగా ఆదివారం నాడు గడ్డి మోపులు కట్టడానికి రోజువారీగా కూలికి వెళ్లి పనిచేస్తూ ఎండకు తాళలేక నీరసంగా ఉండటంతో ఇంటికి చేరుకున్నాడు. అదే సమయంలో ఇంటి వద్ద ఉన్న తన రెండవ కూతురిని వెంట పెట్టుకొని కోదాడ హాస్పిటల్ కు వెళ్లి చికిత్స చేయించుకొని .అదే రోజు
తన పెద్ద కూతురు నడిగూడెం గురుకుల పాఠశాలలో చదువుతుండగా, పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో
ఆమెను తీసుకురావడాని ఎండలోనే కోదాడ నుండి నడిగూడెంకు ఆటోలో బయలుదేరాడు. నడిగూడెం చేరుకున్న కొద్దిసేపటికే మళ్ళీ కాళ్ళు, చేతులు లాగుతుందటంతో నడిగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కు చికిత్స కోసం వెళ్లగా .
అతన్ని పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం కోదాడ
వెళ్లాలని సూచించడంతో కోదాడకి వెళ్తుండగా పరిస్థితి విషమించి మార్గమధ్యంలోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి భార్య,ముగ్గురు కూతుర్లు ఉన్నారు. రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన యాకోబు మరణంతో ఆ కుటుంబం వీధిన పడిందని, ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పెద్ద కూతురు తలకొరివి పెట్టగా దహన సంస్కారాలు నిర్వహించారు..