కవితారచనలో దారిచూపి కవితా మార్గదర్శకుడు డా.తిరునగరి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 25 (నిజం న్యూస్)
ఆలేరు ఆణిముత్యం, ప్రముఖ కవి, దాశరథి పురస్కార గ్రహీత కవి తిలక డా.తిరునగరి (75) కాచిగూడలోని ప్రతిమ ఆసుపత్రిలో చేరిన గుండెపోటు రావడంతో ఏప్రిల్ 25 తేదిన స్వర్గస్తులయ్యారు.ఆయన వర్ధంతి నేడు.ఆయనకు పలువురు నివాళులు అర్పించారు.యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి తెలుగు పాఠం చెప్తుంటే మనసు తిప్పుకోనీయని వాచికం, వింటే చాలు పాఠం అట్లా గుర్తుండిపోయేంత చక్కని బోధన.ఆయన తెలుగు, సంస్కృతం, ఆంగ్లభాషల్లో పారీణత కలవాడు. పద్యం,గద్యం, వచన కవిత్వంలో అందే వేసిన చెయ్యి ఆయనది.

also read: కన్న కొడుకుని హతమార్చిన తండ్రి

అద్భుతమైన ధారణాశక్తి.4గం.ల రాత్రికే లేచి పద్యాలు పాడుతూ పనులు చేసుకునేవాడు.వందల గ్రంథాల నుంచి కోటేషన్లనిస్తూ ఉపన్యాసాలివ్వడంలో తనను మించినవారు లేరు.గొప్పవక్త. ఎందరికో కవితారచనలో దారిచూపి కవితా మార్గదర్శకుడయ్యాడు.సాహిత్యసమీక్షలో అందెవేసిన చెయ్యి. అందరిని ప్రోత్సహించే మనస్తత్వం ఆయనది.30 కవితాసంకలనాలు, వందలకొద్ది సాహిత్యవ్యాసాలు, సమీక్షలు, ముందుమాటలు…ఎన్ని రచనలు చేసినాడో మా గురువు. తనకు పరిచయమైన వారందరికి మొన్నటి కార్డు రాయడం తనకలవాటు.

అంతచిన్న కార్డులో ఎన్ని విషయాలో రాసేవాడు. దాచుకునే మెమోరీలు. తిరునగరి వర్థంతి సందర్భంగా ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ కవి, ఎస్. హరగోపాల్, డా. లింగంపల్లి రామచంద్ర, డా. పోరెడ్డి రంగయ్య, సి.వి. శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ బోట్లపరమేశ్వర్, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, విద్యావేత్త, కవి బండిరాజుల శంకర్, జలాల్ మజీద్, మాయ ఆనంద్ కుమార్, మొరిగాడి ఉపేందర్, తునికి విజయసాగర్, రాంచందర్ గౌడ్, ,పోతుగంటి రాజయ్య, పోతుగంటి సంపత్ కుమార్, సుభాష్ తదితరులు నివాళులు అర్పించారు. తెలుగు సాహిత్య చరిత్రలో శాశ్వతంగా నిలిచిన సుప్రసిద్ధ సాహితీ వేత్త డాక్టర్ తిరునగరి సార్ మరణం సాహిత్య లోకానికి తీరని లోటు. ముఖ్యంగా ఆలేరు ప్రాంతానికి సాహిత్యాన్ని పరిచయం చేసిన ఘనత మా గురువు కు దక్కుతుంది..వందలాది, వేలాది మంది శిష్యులను సాహిత్యాభిమానులు గా తీర్చిదిద్దారు. ఆయన నడిచే గ్రంథాలయం. గొప్ప పండితుడు.వేలాది పద్యాలు కంఠోపాఠం.ఏ విషయం అయినా ఇట్టే చెప్పే బహుముఖ ప్రజ్ఞాశాలి.సాహిత్య రంగం పెద్ద దిక్కును కోల్పోయింది…వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం ఆయన మరిన్ని రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని పలువురు సాహిత్య వేత్తలు ఆకాంక్షించారు. బాల్యంలో పాఠశాలలో మా తెలుగు ఉపాధ్యాయునిగా తెలుగు సాహిత్యం పట్ల అభిరుచిని కల్గించే విధంగా ఎన్నో కథలు పద్యాలు పురాణాలను మనసుకు హత్తుకునే విధంగా ఆసక్తికరంగా బోధించి తెలుగు సాహిత్యం పట్ల ఆకర్షణ కలిగించాడు. గురు శిష్యులు కావడం మేమెంతో గర్వించే విషయం. ఉపాధ్యాయునిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనే ప్రముఖ కవిగా పేరు గడించి అనేక అవార్డులు సొంతం చేసుకున్నాడు. వారు ఏ సభలో ఉంటే ఆ సభకే నిండుదనం వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి సేవలను గుర్తించి దాశరథి అవార్డు ఇవ్వడం మనందరికీ గర్వకారణం. ఎక్కడ కనబడ్డ ఎంతో ఆప్యాయంగా ప్రేమతో పేరుపెట్టి పిలిచి మా కుటుంబ బాగోగులు కూడా అడిగే సార్ ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆలేరు, యాదాద్రి జిల్లా పేర్లను సాహితీ వినీలాకాశంలో ఊరేగించిన సారుకు ఈ ప్రాంతవాసులుగా అందరం ఎంతో ఋణపడి ఉన్నాం.దాశరథి గారన్నట్టు కవి వేగుచుక్క లాంటివాడు.అక్షరం ఉన్నన్ని రోజులు ప్రజల హృదయాల్లో జీవిస్తూనే ఉంటాడు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తన కుమారుడు, మా బాల్య స్నేహితుడు తిరునగరి శ్రీనివాస్ కు ఈ సమయంలో ఎంతో ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నమస్సుమాంజలులు