కన్న కొడుకుని హతమార్చిన తండ్రి

మద్యానికి బానిసై ప్రతిరోజు తల్లిదండ్రులను వేధిస్తున్న తనయుడు
కోనరావుపేట (నిజం న్యూస్) ఏప్రిల్ 25
రాజన్న సిరిసిల్లలో దారుణం జరిగింది. మద్యానికి బానిసై కుటుంబాన్ని తరుచూ వేధిస్తున్నాడని కన్న తండ్రే కొడుకును హతమార్చిన ఘటన జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రంలోని ధర్మారం గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే, గుర్రం బాలయ్య (48)కు ముగ్గురు కుమారులు కాగా, రెండవ కుమారుడు నిఖిల్ ( 22 ) మద్యానికి బానిసై నిత్యా కృత్యంగా తాగుతూ ఇంటికి వచ్చి తరుచూ గొడవ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆదివారం కూడా తాగి రాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చాడు. దీంతో తండ్రి బాలయ్య నిఖిల్‌ని మందలించగా, నిఖిల్ ఎదురు తిరిగి తండ్రిని రోకలి బండతో కొట్టబోయడు, ఆవేశం ఆపుకోలేని బాలయ్య రోకలి బండని లాక్కుని నిఖిల్ తలపైన బలంగా బాదడంతో నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ ఐ ప్రేమ్ దీప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.