మద్యం మత్తులో గొడ్డలి తో భార్య ను నరికిన భర్త

తీవ్ర గాయల తో చికిత్స పొందుతున్న భార్య.
ఆత్మకూర్ ఎస్ ఏప్రిల్‌ 24 (నిజం న్యూస్):
మండలపరిధిలో ని ముక్కుడుదేవులపల్లి గ్రామం లో మద్యo మత్తులో తాగి ఆరోగ్యo పాడు చేసుకోవద్దంటూ మందలించిన భార్య ను గొడ్డలి తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాలప్రకారం బొంత దేవేంద్ర తనభర్త బొంత వీరయ్య తో వ్యవసాయభూమి పనులకు వెళ్లారు. పనులు కొద్ది సేపటికి మధ్యలో పని మానేసి భర్త వీరయ్య గ్రామం లో కి వెళ్లి మద్యం తాగి వచ్చాడు. తాగిన మైకం లోభార్య దేవేంద్ర ను తిడుతుండగా మధ్యాహ్నం అన్నం తినకుండా మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవడం ఎందుకు అంటూ వీరయ్య కు అన్నం పెట్టగా అన్నం తింటూనే మద్యం మత్తులో పక్కనే ఉన్న గొడ్డలి తో భార్యదేవేంద్ర పై విచక్షణా రహితంగా దాడి చేశాడు.

also read: మణుగూరు ఉన్నత పాఠశాలలో పబ్లిక్ లైబ్రరీ

ఈ దాడిలో దేవేంద్ర తలకు, చేతికి, తొడ భాగంలో తీవ్ర గాయలయ్యాయి. తీవ్రరక్త శ్రావంకావడం తో వీరయ్య పరా రయ్యాడు. పరిసర రైతులు వచ్చి గాయలైన దేవేంద్ర ను మంచం పై గ్రామం వరకు ఎత్తుకొచ్చి ఆటోలో సూర్యాపేట కు తరలించారు.108కు సమాచారం ఇచ్చినప్పటికి సమయానికి రాలేదని గ్రామస్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీస్ లు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితురాలు దేవేంద్ర వద్ద పిర్యాదు తీసుకొని దాడికి పాల్పడిన భర్త వీరయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ యాదవేందర్ రెడ్డి తెలిపారు. పరిస్థితి విషమించడం తో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు.
ఏడాది క్రితం తండ్రి మృతి కారకుడు వీరయ్య
ముక్కుడు దేవులపల్లి లో మద్యం మత్తులో భార్య పై గొడ్డలి తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన భర్త బొంత వీరయ్య గత ఏడాది క్రితం భార్య ను కొడుతుండగా అడ్డు వచ్చిన తన తండ్రి బొంత వెంకటయ్య ను వాటర్ పెద్ద పైపు తో కొట్టడం తో తండ్రి వెంకటయ్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.