ఇండ్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేసుకోవాలి…….జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 23(నిజం న్యూస్)
భువనగిరి డివిజన్లోని బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో 30 ఇండ్లు, బీబీనగర్ గ్రామంలో 14 ఇండ్లు, చౌటుప్పల్ డివిజన్లోని పోచంపల్లి మండలం జుబ్లకపల్లి గ్రామంలో 36 ఇండ్లు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రెండు పడకల గదుల ఇండ్ల కేటాయింపులకు అర్హత కలిగిన వారు మీసేవ ద్వారా ఈనెల 25వ తేదీ నుండి వచ్చే మే నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ గ్రామాలకు సంబంధించి మీసేవలో దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డు కలిగియుండి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారు, ఆహార భద్రత కార్డు కలిగినవారు, ఇల్లులేని పేదవారు, గుడిసెలలో నివాసం కలవారు, అద్దెకు ఉన్న వారు అర్పూలని ఆమె తెలిపారు.దరఖాస్తులను సంబంధిత నమునాలో పూర్తి వివరాలతో సంబంధిత ధృవ పత్రాలు జతపరచి వచ్చే మే 9 వ తేదీలోగా మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని, ఇట్టి అవకాశాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె అట్టి ప్రకటనలో కోరారు.