హెల్మెట్ పెట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ పోతుంటే.
బుడతడు ఆదర్శం
మాడుగుల పల్లి ఏప్రిల్ 23 (నిజం న్యూస్)
నల్లగొండ జిల్లా మాడుగుల పల్లి మండల కేంద్రంలో బుడతడు సైకిల్ పై ఎలిమెంట్ పెట్టుకుని ద్విచక్ర వాహనదారులకు ఆదర్శంగా నిలబడడం జరిగింది. పోలీసులు అవగాహన కార్యక్రమాలు పెట్టినప్పటికీ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం మీద వెళ్ళినప్పుడు పెనాల్టీలు విధించినప్పటికీ ప్రజల్లో మార్పు రాలేదు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలిమెంట్ లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు వాహనదారులు హెల్మెట్ వాడినట్లయితే ప్రమాదాలు జరిగినప్పుడు రక్షణగా ఉంటుందని ప్రాణాలు కాపాడుకోవచ్చని పోలీసులు చాలాసార్లు అవగాహన కార్యక్రమంలో చెప్పడం జరిగింది ఇప్పటికైనా వాహనదారులు ఈ బుడతడుని చూసి హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ప్రాణాలు కాపాడుకోవాలి