Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పొద్దు పొద్దు గాల కళాశాల గేటు కు రంగులు వేస్తున్న ప్రిన్సిపాల్

డిగ్రీ కళాశాల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న ప్రిన్సిపాల్, సిబ్బంది పనుల పట్ల హర్షం!

నేటి రోజుల్లో సమయానికి ఉద్యోగానికి రాని ఉద్యోగస్తులు ఎందరో.. వారికి ప్రిన్సిపాల్ , సిబ్బంది స్ఫూర్తిదాయకం.

పొద్దు పొద్దు గల కళాశాల గేటు కు రంగులు వేస్తూ వాకింగ్ కు వెళుతున్న నెటిజన్ల చరవాణికి చిక్కిన చిత్రాలు.

తుంగతుర్తి, ఏప్రిల్ 23 నిజం న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి అంటే, కృషి పట్టుదలతో, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్, తోటి సిబ్బంది సహకారంతో సమయానుకూలంగా ప్రభుత్వం నుండి కళాశాలకు నిధులు రానప్పటికీ, ఒక ప్రక్కన విద్యార్థులకు విద్యను బోధిస్తూ, మరొక ప్రక్క ఉదయం సమయంలో ఐకమత్యంతో కళాశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న తీరును స్థానికులు, మేధావులు వారు చేస్తున్న పనులను గుర్తించి హర్షం వ్యక్తం చేస్తున్న సంఘటన హుజూర్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోటు చేసుకుంది.

ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నా అధ్యాపక ,ఉపాధ్యాయ, ప్రిన్సిపాళ్లు తమ విధులు నిర్వర్తించి, మాకేంటి లే అని సర్ది పెట్టుకుంటున్న తరుణంలో, కళాశాల అభివృద్ధిలో తమ వంతు బాగా స్వామిమలై, కళాశాలకు గేటుకు రంగులు వేస్తూ, కళాశాల చుట్టూ పచ్చని ప్రకృతి వనం తో మొక్కలను పెంచుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధిలో భాగస్వాములై, ఐకమత్యము తో ముందుకు సాగుతున్న కళాశాల ప్రిన్సిపాల్ భీమార్జున రెడ్డికి అభినందనలు తెలపక తప్పదు.

ఉదయం న కొందరు నెటిజన్లు తం మిత్రుల తో కలసి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ జూనియర్,డిగ్రీ కళాశాల గ్రౌండ్ కు వాకింగ్ కు పోయారు…

కానీ ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే డిగ్రీ కళాశాల మెయిన్ గేట్ కు పొద్దున్నే ముగ్గురు వ్యక్తులు పెయింటింగ్ వేస్తూ కనిపించారు వాకర్స్ కు.
పెయింటర్ లు ఇంత పొద్దున్నే పని చేయటానికి వచ్చారేoటబ్బ అనుకున్నారు.

అక్కడే పొరపడ్డారు వారు…

పక్కనే ఉన్న తోటి మిత్రుడునీ అడిగారు ఎవరు వారు ఇంత పొద్దున్నే రంగులు వేస్తున్నారని ఎప్పుడు ఓ మిత్రుడు చెప్పాడు.

గేట్ కు రంగు వేసే వారిలో టోపి పెట్టుకున్న వ్యక్తి ఎవరో కాదని ఆయన *డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బీమార్జున్ రెడ్డి అన్నారు.
వాకార్స్ ఆశ్చర్య పోయారు.
వెంటనే ఆయన్ని పలకరించారు.. వయసులో చిన్న వాడైన నమస్కారం పెట్టారు.

ఆయనలో ప్రిన్సిపాల్ అనే దర్పం లేదు.సాదా, సీదగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.రాత్రంతా కళాశాలలోనే ఉండి పొద్దున్నేగ్రంధాలయాదికారినాగరాజు,మరొకవిద్యార్థితోకలిసిఈపనికిపూనుకున్నారు.కళాశాలకు నిధులు లేనందున స్వయంగా రంగులు వేయటం ప్రారంభించారు.

నెటిజన్లకు మాత్రం చాలా సంతోషం కలిగించింది.

ఆయన అంకితభావం,పట్టుదల చూసి.
ప్రిన్సిపాల్ బీమార్జున్ రెడ్డి* తన సహచర అధ్యాపకుల సహాయ,సహకారాలతో అనేక పనులు చేశారు కళాశాలకు రంగులు వేయించారు.

కావలసిన మౌలిక అవసరాలు సమకూర్చారు.

కళాశాలలో చక్కటి గార్డెన్ పెంచారు.గ్రీనరి మయం చేశారు.

కొందరు ఉద్యోగులు సమయానికి కళాశాలకు రావటమే గగణమైన ఈ రోజుల్లోరాత్రులు కళాశాలలోనే ఉండి కాలేజీ గురించి ఆలోచించడం అభినందనీయం.
కాలేజీ లో 14 మంది అధ్యాపకులు.
350 మంది విద్యార్థులు ఉన్నారంటే ఆనందం కలిగించింది ..
కాలేజీ లో జరిగిన ప్రతి అభివృద్ధి లో నా సహచర అధ్యాపకుల కృషి ఉన్నట్లు ప్రిన్సిపాల్ వారితో అన్నట్లు తెలిసింది.
ప్రతి పనికి లంచం తీసుకునే ఈ రోజుల్లో ఇలాంటి నిజాయితీ,నిబద్దత గల ప్రిన్సిపాల్ హుజూర్ నగర్ లో డిగ్రీ కళాశాల కు దొరకడం నిజంగా విద్యార్థులకు ఓ వరం అని చెప్పక తప్పదు సుమా!

జయహో…. ప్రిన్సిపాల్ ,సిబ్బంది.