తుంగతుర్తి సీఐ జాడ ఎక్కడ..??

రామాయంపేట ఘటనలో సీఐపై A7 కేసు నమోదు.
చట్టం ఎవరికీ చుట్టం కాదంటున్న పోలీసు శాఖ.
నాలుగు రోజులు గడుస్తున్నా సీఐ పై చర్యలు లేనట్లేనా??
తుంగతుర్తి, ఏప్రిల్ 19 నిజం న్యూస్
కామారెడ్డి జిల్లా రామాయంపేట ఘటనలో పేద ఆర్యవైశ్య లైన, గడ్డం సంతోష్, పద్మ ల పై తప్పుడు కేసులు స్థానిక ప్రజా ప్రతినిధులు పోలీసులు, బనాయించడం తో ,మానసికంగా క్రుంగి ,ఆవేదనకు లోనే కుటుంబ సభ్యులు లాడ్జింగ్ లోనే సజీవదహనమయ్యారు. ఈ సంఘటనకు కారకులైన వారి యొక్క పేర్లు బయటకి రావడంతో, ఆరుగురు వ్యక్తులు బుధవారం పోలీస్ స్టేషన్లో లొంగి పోయినట్లు సమాచారం.A7 గా నమోదైన, తుంగతుర్తి సీఐ నాగార్జున గౌడ్, అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన మూడు, నాలుగు రోజుల నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో స్థానిక ప్రజలు, రాష్ట్ర ఆర్య వైశ్యులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు మాత్రం చట్టం ఎవరి చుట్టం కాదని, కారకులైన ప్రతి ఒక్కరిని, అరెస్టు చేసి, చర్యలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా జరిగిన సంఘటనపై తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ నేటి వరకు సిఐ ని సస్పెండ్ కూడా చేయలేదని విమర్శలు జోరుగా ఉన్నప్పటికీ ముందు ముందు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే, కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు, రాష్ట్రంలోని వివిధ సంఘాల ఆర్యవైశ్య నాయకులు, సజీవ దహనానికి కారకులపై, సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి తగిన శిక్ష వేయాలని కోరుతున్నారు.