రోడ్డును ఆక్రమించిన ఆలయ అధికారులు

వేములవాడ, ఏప్రిల్20 (నిజం న్యూస్):
శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంకు సంబందించిన పాదరక్షలు టెండర్ నిర్వాహకులకు ఆలయ ఆవరణలో స్థలాన్ని కేటాయించవలిసిన ఆలయ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పాదరక్షలు భద్రపరుచుటకు మున్సిపల్ రోడ్డుపై చెప్పుల స్టాండ్ పెట్టించి లక్షల ఆదాయానికి గండి కొడుతున్నారు. అసలే ఇరుకు రహదారులు ఆలయ సిబ్బంది నిర్వాహకంతో సగం రోడ్డు చెప్పుల స్టాండ్, ప్రక్కనే
మలమూత్ర విసర్జన చేయడం అక్కడి దుకాణాల యజమానులు దర్శనానికి వచ్చు భక్తులు
వాహనాలు నిలపడంతో నిత్యం భక్తులు వాహనదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి అట్టి చెప్పుల స్టాండ్ ను తొలగించి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని వాహనదారులు భక్తులు అభిప్రాయ పడుతున్నారు.
రోడ్డు పై అక్రమంగా ఉన్న చెప్పుల స్టాండ్ ను తొలగిస్తాం: మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు
రోడ్డుపై ఆలయ అధికారులు అక్రమంగా పెట్టిన చెప్పుల స్టాండ్ ను విషయం మాదృష్టి కి వచ్చింది. అట్టి చెప్పుల స్టాండ్ ను తొలగించాలని ఆలయ అధికారులకు చెప్పాము. వారు తొలగించని యెడల
మున్సిపల్ సిబ్బందిచే చెప్పుల స్టాండ్ తొలగించి ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండ చూస్తాము.