సాగర్ ఎడమ కాల్వపై పడిపోయిన వడ్ల ట్రాక్టర్

*కాలువ కట్టపై గుంతల రోడ్డే కారణం.*
*రైతన్న గోసకు ఎన్ఎస్పి అధికారులే బాద్యులు.*
మిర్యాలగూడ ఎప్రిల్ 20.(నిజంన్యూస్): సాగర్ ఎడమ కాల్వ కట్టలు లక్షల గుంతలతో రైతులకు,వాహన దారులకు నరకాన్ని చూపిస్తున్నాయి.
తడకమళ్ళ బ్రిడ్జి నుండి దోసపాడు,దాసారం వరకు లక్షల గుంతలు ఉన్నాయని అవి పూడ్పించి,మట్టి రోడ్ వేయాలని గతంలో *నిజంన్యూస్* ద్వారా ఎన్ఎస్పి ఈఈ ల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.
వెంటనే టెండర్లు ద్వారా రోడ్ వర్క్ చేస్తామని చెప్పారు.
కాని ఏ మాత్రం పట్టించుకోలేదు.
ఈ ఎడమ కాలువ కట్టపై ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటమే.
రైతులు ఆరుగాలం కష్ట పడి పండించిన వరి దాన్యాన్ని ఇలా గుంతల రోడ్డు వలన రోడ్లపై ట్రాక్టర్ బోల్తా పడటం తో ఆ రైతు గోస వర్ణనాతీతం.
దీనికి బాద్యులు ఎన్ఎస్పి అధికారులు,ప్రజాప్రతినిదుల నిర్లక్ష్యమే,
ఆ రైతు ఉసురు వీరికి తప్పక తగులుతుందని ఆ రైతు ఆవేదనతో శాపనార్దం పెడుతూ కన్నీరు పెట్టుకున్నాడు.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు,అధికారులు స్పందించి సాగర్ ఎడమలకాల్వ కట్టను మట్టితో గుంతలను పూడ్పించి ,రోలింగ్ చేయించాలని కాలువ కింది పొలాల రైతులు విన్నవవిస్తున్నారు.