చట్ట వ్యతిరేకంగా అబార్షన్ చేసిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 18(నిజం న్యూస్)
అక్రమంగా అబార్షన్ చేసి ఓ పసికందు మృతికి కారణమైన భువనగిరి పట్టణంలోని శ్రీ స్వాతి ఆసుపత్రి డాక్టర్ శివకుమార్ పై సెక్షన్ 315 ప్రకారం కేసు నమోదు చేయాలని బాదితురాలు మహేశ్వరి సోమవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కి ప్రజావాణి కార్యక్రమం లో పిర్యాదు చేసారు.
also read: తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడి మృతి
తన ప్రియుడు శ్రీధర్ ద్వారా తనకు కల్గిన ప్రెగ్నెన్సీ (5 నెలలు) పాపను తన అనుమతి లేకుండా అబార్షన్ చేసిన డాక్టర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె కలెక్టర్ ను కోరారు. తనకు అక్రమంగా అబార్షన్ చేయడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని,తన ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి తనకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా సహకారం అందించాలని బాదితురాలు మహేశ్వరి జిల్లా కలెక్టర్ ను కోరారు.